షాకింగ్..స్టోన్ క్రషర్ లో పడిన వ్యక్తి!
గ్రామంలో విషాధచాయలు నెలకొన్నాయి.
ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలోని పిప్పిరి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామ శివారులో స్టోన్ క్రషర్ గుంతలో పడి ఓ వ్యక్తి గల్లంతు అయ్యాడు. వర్తమాన్నూర్ గ్రామానికి చెందిన ఆరెల్లి రాకేష్ వినాయక నిమజ్జనం కోసం శనివారం క్వారీ వద్దకు వెళ్లి గల్లంతు అయ్యాడు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో గ్రామంలో విషాధచాయలు నెలకొన్నాయి.



