సూర్యాపేటలో దారుణం

పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేటలో ప్రియాంక కాలనీలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రియాంక కాలనీలో నివాసముంటున్న వెంకటేష్ దంపతులకు పన్నెండు నెలల పాప ఉంది.
మద్యానికి బానిసైన తండ్రి వెంకటేష్ మద్యం మత్తులో తన భార్యతో గొడవకు దిగాడు .. మాటకు మాట పెరిగి ఆ ఆవేశంలో ఆ సమయంలో ఏడుస్తున్న పన్నెండు నెలల కూతురిని నేలకేసి కొట్టాడు. నేలకేసి కొట్టిన తండ్రి ఏడిస్తే బయటకు వినిపిస్తుందని ఆ చిన్నారిని తీవ్రంగా కొట్టాడు.
తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందింది. పారిపోవాలని ప్రయత్నించిన తండ్రి వెంకటేష్ ను చుట్టూ ప్రక్కల వాళ్లు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.