సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో మరో ట్విస్ట్

పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలో సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో ప్రధాన నిందితురాలైన డాక్టర్ నమ్రతను స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. డా. నమ్రతను సికింద్రాబాద్ గోపాలపురం పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు.
కోర్టులో హజరుపరచగా ఆమెకు ఐదు రోజులు రిమాండ్ విధించింది. ఈ ఐదురోజుల పాటు పోలీసులు విచారించనున్నారు. ప్రస్తుతం ఆమె చంచల్ గూడ జైల్లో ఉన్నారు. చంచల్ గూడ జైల్లో ఖైదీగా ఉన్న ఆమెను పోలీసులు కస్టడీకి తీసుకొనున్నారు. ఈ క్రమంలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నమ్రతపై హ్యూమన్ ట్రాఫికింగ్ తో పాటు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
పిల్లలు లేని ధనవంతులైన దంపతులే లక్ష్యంగా ఈ దందా నడిచినట్లు , వారి నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. సృష్టి ఫెర్టీలిటీ సెంటర్ లో పిల్లలు లేని దంపతులను టార్గెట్గా చేసుకుని భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించారు. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో సరోగసి మాటున శివశివుల విక్రయాలు జరిపినట్లు నిర్దారణ అయింది. అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో పెనుసంచలనంగా మారిన ఈ కేసులో మరో ట్విస్ట్ నమోదైంది. విశాఖలో సృష్టి ఫెర్టిలిటీ ఉన్న భవనంలో క్షుద్ర పూజలు జరిగినట్లు అక్కడి పోలీసులు గుర్తించారు. ఈభవనం నిర్మాణ దశలో ఉన్న ఫెర్టిలిటీ సెంటర్ భవనంలో క్షుద్ర పూజలు చేసినట్లు పోలీసులకు విచారణలో ఆధారాలు దొరికాయి.