పూర్ణచందర్ నాతో అసభ్యంగా ప్రవర్తించేవాడు – యాంకర్ స్వేచ్ఛ కుమార్తె

పల్లవి, వెబ్ డెస్క్ : ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ యాంకర్, జర్నలిస్టు, రచయిత్రి స్వేఛ్చ వోటార్కర్ శుక్రవారం తన నివాసంలో ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి గురైన సంగతి తెల్సిందే. అయితే, యాంకర్ స్వేఛ్చ మృతికి పూర్ణచందర్ అనే వ్యక్తే ప్రధాన కారణం అని ఆమె తండ్రి ఆరోపించారు.
ఇప్పటికే పూర్ణచందర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో స్వేఛ్చ కుమార్తె పూర్ణచందర్ గురించి మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. స్వేఛ్చ కుమార్తె మాట్లాడుతూ ” పూర్ణచందర్ నా పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడు.
చెప్పుకోరాని చోట బ్యాడ్ తచ్ చేసేవాడు. మమ్మీని కూడా చాలా సార్లు తీవ్రంగా హింసించేవాడు. ఆయన వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. పూర్ణ లేఖలో అన్నీ అవాస్తవాలే. ప్రభుత్వం అతడ్ని కఠినంగా శిక్షించాలి ” అని ఆమె డిమాండ్ చేశారు.