డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో భారీ మోసం… నకిలీ తాళాలకు రూ.2లక్షలు
డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో కేపీహెచ్బీ కాలనీలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. బుకింగ్ పేరుతో డబ్బులు చెల్లించి 15 మంది బాధితులు మోసపోయారు. బాధితులకు నకిలీ పత్రాలు, తాళాలు చూపించి మోసం చేశాడు.
డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో కేపీహెచ్బీ కాలనీలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. బుకింగ్ పేరుతో డబ్బులు చెల్లించి 15 మంది బాధితులు మోసపోయారు. బాధితులకు నకిలీ పత్రాలు, తాళాలు చూపించి మోసం చేశాడు నిందితుడు వేణుగోపాల్దాస్. ఒక్కొక్కరి నుంచి రూ.లక్షా 70 వేల నుంచి రూ.2.5 లక్షలు వసూలు చేశాడు.
నిందితుడు ఇచ్చిన తాళాలు తీసుకుని ఇళ్లకు వద్దకు వెళ్లిన బాధితులకు ఊహించని షాక్ తగిలింది. ఇళ్లలో అసలైన లబ్ధిదారులు ఉండటంతో బాధితులువిస్తుపోయారు. వేణుగోపాల్దాస్ చేతిలో మోసం పోయామని తెలుసుకున్న బాధితులు కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం వేణుగోపాల్దాస్ పరారీలో ఉన్నట్లు సమాచారం.
Related News
-
ఉపఎన్నికలపై పీసీసీ చీఫ్ మహేశ్ సంచలన వ్యాఖ్యలు
-
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ సన్నాహక సమావేశం
-
గణేష్ ఉత్సవాలంటే.. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు – సీఎం రేవంత్ రెడ్డి
-
అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్ధు..!
-
బీజేపీలో కవిత చేరికపై రాంచంద్రరావు క్లారిటీ
-
భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి -మాజీ ఎమ్మెల్యే సండ్ర



