Royal Enfield : రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ వెహికల్ వచ్చేసింది
Royal Enfield : డుగ్.. డుగ్ అని సౌండ్ చేస్తూ రోడ్డుపై వెళ్తోన్న వారి చూపును అట్రాక్ట్ చేసే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఎలక్ట్రిక్ వెహికల్‌ను లాంఛ్ చేసింది
Royal Enfield : డుగ్.. డుగ్ అని సౌండ్ చేస్తూ రోడ్డుపై వెళ్తోన్న వారి చూపును అట్రాక్ట్ చేసే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఎలక్ట్రిక్ వెహికల్‌ను లాంఛ్ చేసింది. రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ సీ6 పేరుతో లాంఛ్ అయిన ఈ బైక్ 2026లో అందుబాటులోకి రానుంది. అక్టోబర్ చివరి వారంలో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. పారాచూట్ ద్వారా ఎయిర్‌లిఫ్ట్ చేసినట్లు ఈ వీడియోలో చూపించారు. ఇది రెండో ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్ సైన్యం వాడిన ఒరిజినల్ ఫ్లయింగ్ ఫ్లీ బైక్ నుంచి ప్రేరణ పొందింది. ఇంజిన్ ఉండే చోట బ్యాటరీని ఉంచారంతే. 100 KM రైడింగ్ రేంజ్ ఉండొచ్చు.
ఫ్రేమ్: అల్లైడ్ అల్యూమీనియ్ ఫ్రేమ్
బ్యాటరీ: బరువు తక్కువగా ఉండేందకు వీలుగా మెగ్నీషియమ్ బ్యాటరీ వాడారు.
డిజైన్: రౌండ్ హెడ్‌లైట్, ఫాక్స్ ఫ్యుయెల్ ట్యాంక్ మాదిరిగా కనిపించే డిజైన్, ఎల్ఈడీ లైటింగ్ ఉంటుంది.
డిస్ప్లే: టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ డిస్ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ.
సేఫ్టీ: ట్రాక్షన్ కంట్రోల్, కార్నింగ్ ఏబీఎస్, ముందు, వెనక డిస్క్ బ్రేకులుంటాయి.
రేంజ్: ఒకసారి ఛార్జీ చేస్తే 150-200 కి.మీ ప్రయాణం చేసేందుకు వీలుంది.



