ఓటీటీలోకి ‘బైరవ’
పల్లవి, వెబ్ డెస్క్ : టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన యువ స్టార్ హీరోలు బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ లు ముగ్గురు హీరోలుగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘ బైరవ’ . ఇటీవల విడుదలైన ఈ చిత్రం మిక్స్ డ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద పర్వాలేదన్పించింది.
ఈ చిత్రం మే నెల ముప్పై తారీఖున ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించగా శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.
కెకె రాధామోహన్ నిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీలో అదితి శంకర్, దివ్య పిళ్ళై, సందీప్ రాజ్, ఆనంది నీలిమ, జయసుధ, వెన్నెల కిషోర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే ఈ మూవీ పద్దెనిమిదో తారీఖు ఆర్ధరాత్రి నుంచి ఓటీటీలోకి రానుంది. తెలుగు , హిందీ భాషల్లో ఈ చిత్రం ZEE5లో స్ట్రీమింగ్ కానున్నది.



