తెలంగాణలో వచ్చేది బీజేపీ సర్కారే – టీబీజేపీ చీఫ్ రామచందర్రావు

పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణలో వచ్చేది బీజేపీ సర్కారే. పదేండ్లు బీఆర్ఎస్ పాలనలో విసిగిపోయిన ప్రజలు మార్పు కోసం కాంగ్రెస్ కు ఓట్లు వేస్తే ఆ పార్టీ ఏడాదిన్నరలోనే నమ్మి ఓట్లేసిన పాపానికి అన్ని వర్గాలను మోసం చేసింది. వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీజేపీ వైపు చూస్తోన్నారు.
కేంద్రంలో మోదీ సర్కారు, తెలంగాణలో బీజేపీ సర్కారు ఉంటే బాగుంటుందని ప్రజలు ఆలోచిస్తున్నారు అని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచందర్రావు పేర్కొన్నారు. హైదరాబాద్ లోని ఘట్కేసర్ పరిధిలో అన్నోజిగూడలో జరిగిన బీజేపీ పార్టీ మండల, డివిజన్ అధ్యక్షుల, నేతల వర్క్ షాప్ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అథితిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ క్యాడర్ క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయాలి. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ఆయన అన్నారు.
Related News
-
సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర కీలకం – ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
-
భారీ ధర పలికిన బాలాపూర్ లడ్డూ
-
మహిళల ఆర్థికంగా అభివృద్ధి సాధించాలి- ఎంపీ కావ్య
-
సామాజిక కార్యక్రమాలకే ఎక్కువ సమయం కేటాయిస్తా -ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
-
వచ్చే సీజన్ కోసం కూలైన్లల్లో రైతులు -ఎంపీ రఘువీరారెడ్డి
-
శిల్పాశెట్టి దంపతులపై కేసు నమోదు