ఉప్పు లేదా పంచదార.. పెరుగులో ఆరోగ్యానికి ఏది మంచిది?

మనలో చాలా మందికి పెరుగు అంటే చాలా ఇష్టం. పెరుగులో శరీరానికి అవసరమైన ప్రొటీన్లు, కాల్షియం మొదలైన వివిధ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. సాధారణంగా చాలామంది వేసవిలో మాత్రమే పెరుగు తినడానికి ఇష్టపడతారు. కారణం శరీరంలోని వేడిని తగ్గించి ఆరోగ్యంగా ఉంచుతుంది కాబట్టి. అయితే ఎండాకాలం, చలికాలం అనే తేడా లేకుండా పెరుగు శరీరానికి ఎలాంటి హాని కలిగించదని నిపుణులు చెబుతున్నారు. కొందరు పెరుగులో పంచదార కలిపి తింటే మరికొందరు ఉప్పు కలిపి తింటారు. అయితే ఈ రెండింటిలో ఏది మంచిదో తెలుసుకుందాం.
పెరుగు, ఉప్పు:
మీరు బీపీతో బాధపడుతుంటే, ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల మీకు హాని కలుగుతుందని గుర్తుంచుకోండి. ఎందుకంటే ఉప్పులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ పెరుగుతో కలిపి తింటే పెరుగులోని మంచి బ్యాక్టీరియాను చాలా వరకు నాశనం చేస్తుంది. అలాగే ఉప్పు కలిపిన పెరుగును ఎక్కువగా తినడం వల్ల అధిక రక్తపోటు వస్తుంది. కాబట్టి రెండింటినీ కలిపి తినడం మంచిది కాదు.
పెరుగు, చక్కెర:
చక్కెరతో పెరుగు తినడం జీర్ణవ్యవస్థకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే చక్కెర పెరుగులోని మంచి బ్యాక్టీరియాను నాశనం చేయదు. అంతేకాకుండా కడుపులో మంటను కూడా తగ్గిస్తుంది. అయితే ఈ రెండింటిని కలిపి తింటే వేగంగా బరువు పెరుగుతారు. ఎందుకంటే, ఇది అధిక కేలరీల కంటెంట్‌తో నిండి ఉంటుంది. ముఖ్యంగా, మీరు డయాబేటిస్ వ్యాధితో బాధపడుతూ ఉన్నట్లయితేత పెరుగును ఉప్పుతో తినకూడదని గుర్తుంచుకోండి.
పెరుగులో కొద్దిగా ఉప్పు, పంచదార కలిపి తింటే ఎటువంటి హాని ఉండదు కానీ మీరు డయాబెటిస్తో బాధపడుతున్నట్లయితే, మీకు బీపీ సమస్య లేదా ఊబకాయంతో బాధపడుతున్నట్లయితే, అది మీకు కొన్ని దుష్ప్రభావాలను కలిగిస్తుంది. కాబట్టి, వాటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి పరిస్థితుల్లో ఉప్పుకు బదులు పంచదార కలపడమే బెస్ట్ ఆప్షన్ అంటున్నారు నిపుణులు.