నిమ్మకాయలను వాడాక నిమ్మతొక్కలను పడేయకండి..!

పల్లవి, వెబ్ డెస్క్ : మన దైనందిన జీవితంలో నిమ్మకాయలను తరచూ ఉపయోగిస్తూనే ఉంటూ ఉంటాము. వాటినుంచి రసాన్ని తీసి వాడుకుంటాము. కొందరూ దీన్ని నేరుగా తాగుతారు. లేదా కూల్ డ్రింక్స్ లాగా రకరకాల పానీయాల్లో కలుపుకుని తాగుతారు.అంతేకాదు వంటకాల్లోనూ పులిహోర లో నిమ్మరసం కలుపుకుంటారు. చికెన్ మటన్ ఇలా అనేక వంటకాలు వండుకుని తినే సమయాల్లోనూ వాడతారు. అయితే చాలా మంది నిమ్మకాయల నుంచి నిమ్మరసం తీశాక వాటి తొక్కలను పడేస్తుంటారు.
కానీ వాటివలన కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. నిమ్మరసం తీశాక వాటితొక్కలను ఎండబెట్టి పొడి చేసి దాన్ని నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను తీసుకోవచ్చు. లేదా ఆ పొడితో ఫేస్ ప్యాక్, హెయిర్ ప్యాక్ వంటివి తయారు చేసి కూడా వాడుకోవచ్చు. ఇలా నిమ్మ తొక్కలను వాడడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి.నిమ్మతొక్కలో ఉండే విటమిన్ సి తోపాటు యాంటీ ఆక్సిడెంట్లు ,ఫ్లేవనాయిడ్స్, లైమోనీన్, హెస్పెరెడిన్, రుటిన్ లు అధికంగా ఉంటాయి.
ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలించేందుకు సహాయం చేస్తాయి. దీంతో ఆక్సీకరణ ఒత్తిడి తగ్గిపోతుంది. కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. నిమ్మతొక్కల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న కారణంగా రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మార్చడంతో ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. అంతేకాదు సీజనల్స్ లో వచ్చే దగ్గు, జలుబు నుంచి చాలా ఉపశమనం లభిస్తుంది.నిమ్మ తొక్కలో డి లైమోనీన్ అనే సమ్మేళనం యాంటీ క్యాన్సర్ లక్షణాలను కలిగి ఉంటుందని సైంటిస్టుల జరిపిన ఓ అధ్యయనంలో తేలింది. నిమ్మ తొక్కలను తరచూ వాడడం వల్ల శరీరంలో ఉండే క్యాన్సర్ కణాలు నాశనం అవుతాయి.