నిశ్శబ్ధం చేసే మేలు ఎంతో తెలుసా..?

పల్లవి, వెబ్ డెస్క్ : నిశ్శబ్దానికి ఉన్న పవర్ గురించి ఎంత చెప్పినా తక్కువ అని అందరూ అంటుంటారు. ప్రపంచయుద్ధాన్ని సైతం ఆపగలిగే శక్తి నిశ్శబ్ధానికి ఉంటుంది. అదే ప్రపంచ యుద్ధానికి కూడా కారణమవుతుందని అంటున్నారు. అయితే నిశ్శబ్ధంగా ఉంటే ఏకాగ్రత, మానసిక దృఢత్వం, ప్రశాంతత లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉండటంతో సోషల్ మీడియా వాడకం పెరిగిపోయి నిశ్శబ్దం అంటే ఓ భయంకరమైన విషయంగా మారిపోయింది. ఒక పది నిమిషాలు ఫోన్ వాడకుండా.. నిశ్శబ్దంగా ఉంటే చచ్చిపోతామేమో అన్న స్థితికి జనం వచ్చేశారంటే స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా వాడకం ఎంతగా ప్రభావితం చేస్తుందో ఆర్ధమవుతుంది.
అయితే 2013లో ఇమ్కే కిర్‌స్టే, ఆయన సహచరులు నిశ్శబ్దంపై ఓ పరిశోధన చేశారు. ఈ పరిశోధనల్లో మనిషి బ్రెయిన్‌కు రెస్ట్ దొరికితే దానంతట అది సెల్ఫ్ రిపేర్ చేసుకుంటుంది. కేవలం నిద్ర మాత్రమే కాదు.. నిశ్శబ్దం కూడా బ్రెయిన్‌ను రిపేర్ చేయగలుగుతుంది. ఓ రెండు గంటల పాటు నిశ్శబ్దంగా ఉన్నారంటే బుర్రకు కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కాదు. ప్రతీ రోజూ కొంత సమయం పాటు నిశ్శబ్దంగా ఉంటే బ్రెయిన్ ఆరోగ్యం మెరుగుపడుతుందని న్యూరాలజీ డాక్టర్ పవన్ ఓయిజా అంటున్నారు.