ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

పల్లవి, హైదరాబాద్: వాతావరణ మార్పుల నేపథ్యంలో భూ గ్రహాన్ని రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పల్లవి, డీపీఎస్ విద్యా సంస్థల చైర్మన్ మల్క కొమురయ్య అన్నారు. జీవ వైవిధ్యం పెంపొందించడానికి స్కూల్ స్థాయి నుంచే అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ సమీపంలోని కన్హశాంతి వనంలో ‘యూత్ యాక్ట్స్: ప్లాంటింగ్ ఫర్ ఏ సస్టేయినబుల్ ఫ్యూచర్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రోగ్రామ్ కు ముఖ్య అతిథులుగా పల్లవి, డీపీఎస్ విద్యా సంస్థల చైర్మన్ మల్క కొమురయ్య, సీఈవో మల్క యశస్వి, ఐక్యరాజ్యసమితి G20 ల్యాండ్ యూజ్ డైరెక్టర్ మురళీ తుమ్మరుకుడి తదితరులు హాజరయ్యారు. సుస్థిరాభివృద్ధే లక్ష్యంగా యూనైటెడ్ నేషన్స్ కొలాబరేషన్ తో ‘జీ 20 గ్లోబల్ ల్యాండ్ ఇనిషియేటివ్’లో భాగంగా నిర్వహించిన మొక్కలు నాటే ఈ కార్యక్రమంలో పల్లవి, డీపీఎస్ స్కూళ్ల నుంచి 2500 మంది స్టూడెంట్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూఎన్ సీసీడీ డైరెక్టర్ మాట్లాడుతూ.. వాతావరణ మార్పులు, సుస్థిరాభివృద్ధిలో పౌరుల పాత్ర, విద్యార్థుల విధి గురించి అవగాహన కల్పించారు. ఈనంతరం విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు.



