సీపీఎస్ రద్దు మాటను నిలబెట్టుకోవాలి
సీపీఎస్ రద్దు మాటను నిలబెట్టుకోవాలి

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య
పల్లవి, బాన్సువాడ: సీపీఎస్ రద్దు మాటను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ బీజేపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య కోరారు. ఈ మేరకు ఆయన తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం కామారెడ్డి జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాఘవరెడ్డి,సంతోష్ ఆధ్వర్యంలో బాన్సువాడలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన తపస్ జిల్లా కార్యవర్గ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెండింగ్ లో ఉన్న డీఏలను, జీపీఎఫ్ బిల్లును వెంటనే విడుదల చేయాలని, పీఆర్సీ ప్రకటించి వెంటనే అమలు చేయాలని, ప్రమోషన్లు ఇవ్వాలని, హెల్త్ కార్లు ఇస్తామన్న ముఖ్యమంత్రి వారి మాటను నిలబెట్టుకోవాలని, కేజీబీవీ ఉద్యోగులకు మినిమం స్కేల్ ఇవ్వాలని, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు జీరో వన్ జీరో కింద జీతాలు ఇవ్వాలని, హెల్త్ కార్డులు కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవత సురేష్ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 8న జీఓ 317 ద్వారా స్థానికతను కోల్పోయిన ఉపాధ్యాయులకు వారి సొంత జిల్లాలకు పంపించాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 8న ధర్నా చౌక్ వద్ద జరిగే తపస్ ధర్నాను విజయవంతం చేయాలని ఆయన కోరారు. సమావేశం అనంతరం కామారెడ్డి జిల్లా తపస్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు రవీంద్రనాథ్ ఆర్య, అధ్యక్షులు రాష్ట్ర ఐటీ విభాగం ప్రతినిధి రమేష్ కుమార్, లక్ష్మణాచారి, తపస్ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా లక్ష్మణ్, జిల్లా బాధ్యులు మండల బాధ్యులు భాస్కర్, రచ్చ శివకాంత్, కిష్టయ్య, శంకర్ తదితరులు పాల్గొన్నారు.