దివ్యాంగులకు క్రీడా పోటీలు

పల్లవి, హైదరాబాద్: దివ్యాంగులైన పిల్లల సాధికారత కోసం కృషి చేసేందుకు తాము ఎప్పుడూ ముందు ఉంటామని పల్లవి స్కూల్స్ చైర్మన్ మల్క కొమురయ్య తెలిపారు. ఈ మేరకు సాధన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటెలెక్చువల్లీ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్ కోసం నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూలు క్యాంపస్ లో నిర్వహించిన క్రీడా పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇంటెలెక్చువల్లీ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్ కోసం పల్లవి ఫౌండేషన్ అన్ని విధాల సహకరిస్తుందని ఆయన పేర్కొన్నారు. అసాధారణమైన విద్యార్థులను సాధికారపరచడానికి తాము ముందు ఉంటామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఇంటెలెక్చువల్లీ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్ ను క్రీడా పోటీల్లో ఆయన ప్రోత్సహించారు. క్రీడాపోటీలు నిర్వహించినందుకు గానూ విద్యార్థులు డీపీఎస్ కు, యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.


