టీచర్ల సమస్యలపై పోరాటం చేస్తా: మల్క కొమరయ్య
టీచర్ల సమస్యలపై పోరాటం చేస్తా: మల్క

పల్లవి, హైదరాబాద్: ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటం చేస్తానని బీజేపీ కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య అన్నారు. శుక్రవారం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తన పేరును ఖరారు చేసిన తర్వాత ఆయన మాట్లాడారు. ‘‘పార్టీ నా మీద నమ్మకం పెట్టి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. గత ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను గాలికి వదిలేసింది. ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే ధోరణి కొనసాగిస్తోంది. ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటం చేస్తా. నేను చేయబోయే పోరాటానికి టీచర్లు మద్దతు ఇస్తారనే విశ్వాసం నాకుంది. ఉపాధ్యాయులు లేనిదే విద్య లేదు. అవకాశం ఇస్తే విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా’’నని మల్క కొమరయ్య ప్రకటించారు.