డీపీఎస్ నాచారంలో వరల్డ్ హెరిటేజ్ డే
డీపీఎస్ నాచారంలో వరల్డ్ హెరిటేజ్ డే

పల్లవి, హైదరాబాద్: ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాచారం క్యాంపస్ లో 5, 6వ తరగతి విద్యార్థులు ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ వారసత్వ ప్రదేశాలు, వాటి ప్రాముఖ్యత తెలిసేలా చిత్రాలు గీశారు. ఆయా ప్రాంతాల నాగిరకత, సంస్కృతీ సాంప్రదాయాలను తోటి విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థుల యాక్టివిటీని స్కూల్ ప్రిన్సిపల్ సహా టీచర్లు అభినందించారు. ఈ కార్యక్రమంలో టీచర్లు, స్టూడెంట్స్ పాల్గొన్నారు.