నాచారం డీపీఎస్ కు రోడ్‌సేఫ్టీ అవార్డు
నాచారం డీపీఎస్ కు రోడ్‌సేఫ్టీ అవార్డు

పల్లవి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదాలను అరికట్టడంలో భాగంగా సర్వేజనా ఫౌండేషన్ ‘స్టాప్రోడ్యాక్సిడెంట్’ యాప్‌ద్వారా ఆన్లైన్ లో నిర్వహించిన ఎస్సే రైటింగ్పోటీల్లో ఢిల్లీ పబ్లిక్స్కూల్నాచారం క్యాంపస్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి అవార్డు సొంతం చేసుకుంది. మొత్తం15 ఉత్తమ పాఠశాలలను రోడ్‌సేఫ్టీ ఛాంపియన్స్‌గా ఎంపిక చేయగా.. అందులో నాచారం డీపీఎస్అత్యుత్తమ స్థానంలో నిలిచింది. ఈ మేరకు గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్స్టాఫ్కాలేజ్ఆఫ్ఇండియా ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో సర్వేజనా ఫౌండేషన్చైర్మన్డాక్టర్ఏ.వి గురువా రెడ్డి, సినీ నటుడు మురళీమోహన్, సీనియర్ఐఏఎస్ఆఫీసర్జనార్ధన్రెడ్డి తదితర ప్రముఖుల చేతుల మీదుగా.. అవార్డు తీసుకున్నారు. డీపీఎస్నాచారం క్యాంపస్‌కు అవార్డు రావడం పట్ల చైర్మన్మల్క కొమరయ్య హర్షం వ్యక్తం చేశారు.