లీకైన కూలీ కథ…!

పల్లవి, వెబ్ డెస్క్ : సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా యంగ్ సంచలన డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా మూవీ కూలీ. ఇప్పటికే చిత్రీకరణ, డిజిటల్ వర్కింగ్ తో పాటు టెక్నికల్ వర్క్ అంతా పూర్తి చేసుకుని మరో రెండు వారాల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఆగస్టు పద్నాలుగో తారీఖున స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు ఈసినిమా రానుంది.
ఈనేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన కథాంశం లీకైంది. విడుదలకు రెండు వారాల ముందే విదేశీ సెన్సార్‌షిప్ కోసం తాజాగా దరఖాస్తు చేసింది. ఈ సమాచారం మేరకు కార్మిక సంఘాలు , రహస్యంగా సాగే అక్రమ రవాణా ముఠాల నేపథ్యం, రోజూ వారీ కూలీలను అత్యంత కిరాతకంగా వేధించే ముఠాకు వ్యతిరేకంగా పోరాడే ధైర్యవంతుడైన కార్మికుడి పోరాటమే ఈ సినిమా మూల కథాంశం అని గుసగుసలు వినిపిస్తున్నాయి.
శక్తి, దృఢ సంకల్పంతో పాటు తనదైన శైలీలో పోరాటం చేయడంతో పాటు కార్మిక వర్గం గౌరవాన్ని కాపాడే సాటి కార్మికుడిగా సూపర్ స్టార్ రజనీకాంత్ పాత్ర కొనసాగుతుంది. ఇందులో పాతకాలపు రజనీ స్టైల్, లోకేశ్ కనకరాజ్ శక్తివంతమైన కథనం, స్టైలిష్ యాక్షన్ సన్నివేశాలతో పవర్ ఫుల్ యాక్షన్ మాస్ మూవీగా తెరకెక్కిస్తున్నారు.
ఇంకా ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ , సత్యరాజ్ , శృతిహాసన్, షౌబ షాహిర్ వంటి పలువురు అగ్రనటీనటులు నటిస్తుండగా అనిరుధ్ రవిచంద్ర సంగీతం అందిస్తున్నాడు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
Related News
-
చిరునవ్వుతోనే మత్తెక్కిస్తోన్న ప్రగ్యా జైస్వాల్
-
అల్లరి నరేష్ హీరోగా సరికొత్త మూవీ
-
రోడ్లపై రైతులు.. స్టార్ హోటల్‌లో మంత్రులు-మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
-
నేను బీఆర్ఎస్ లోనే ఉన్నా-ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
-
గణేశ్ లడ్డూను దక్కించుకున్న ముస్లిం మహిళ
-
CSR నిధులతో గురుకులాలు అభివృద్ధి – మంత్రి దామోదర