పల్లవి ఇంటర్నేషనల్ స్కూలు (కీసర)లో పదవ తరగతి విజయోత్సవ సమావేశం.

2024- 25 సంవత్సర వార్షిక పరీక్ష మే 13 మంగళవారం నాడు విడుదలైన ఫలితాలలో విజయాన్ని సాధించిన పల్లవి ఇంటర్నేషనల్ స్కూలు (కీసర) విద్యార్థులందరికీ ,పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి శ్రీలత చన్న ప్రగడ విజయోత్సవ సమావేశాన్ని నిర్వహించారు .
మొదట కార్యక్రమాన్ని విద్యార్థుల తల్లిదండ్రుల చేత మరియు పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి శ్రీలత చన్న ప్రగడ , వైస్ ప్రిన్సిపాల్ శ్రీమతి వైష్ణవి చేతుల మీదుగా దీప ప్రజ్వలన చేయడం జరిగింది.
ఈ కార్యక్రమం లో భాగంగా ప్రిన్సిపల్ శ్రీమతి శ్రీలత చన్నప్రగడ గారు తన ప్రసంగంలో అత్యద్భుత ఫలితాలను సాధించిన విద్యార్థులను అభినందించారు. బోధనా సిబ్బంది అంకితభావంతో కృషి చేశారని ప్రశంసించారు.
విద్యార్థులను ఉన్నత లక్ష్యాలను సాధించడానికి, ప్రేరేపించింది. కెరియర్ కౌన్సిలింగ్ స్టేషన్లో, పోటీ పరీక్షల సందిగ్ధత కార్యక్రమాలు, విద్య వృత్తిపరమైన ప్రమాణాల ద్వారా వారికి మార్గ నిర్దేశకం చేయడానికి నైపుణ్యం ఆధారిత అభ్యాస అంశాలతో సహా భవిష్యత్తు కార్యక్రమాలను వివరించారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులకు, విద్యార్థులకు పుష్ప గుచ్చాలను అందించి వారిని అభినందించడం జరిగింది . ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు విద్యార్థులను ఎంతగానో అభినందించారు.
రాబోయే ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాట వేయాలని ఆకాంక్షించారు. మొదటి స్థానంలో B. ఈశ్వర్ సాయి, YSL మేఘన 95% ,ద్వితీయ స్థానంలో D.సాయి స్వరూప ,సుయేష్ మల్హరి హబ్ 94% ,తృతీయ స్థానంలో S.సువర్షిత, ఇషిక 92 % ఉత్తీర్ణతతో ఫలితాలను సాధించారు.
Related News
-
సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర కీలకం – ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
-
భారీ ధర పలికిన బాలాపూర్ లడ్డూ
-
మహిళల ఆర్థికంగా అభివృద్ధి సాధించాలి- ఎంపీ కావ్య
-
సామాజిక కార్యక్రమాలకే ఎక్కువ సమయం కేటాయిస్తా -ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
-
వచ్చే సీజన్ కోసం కూలైన్లల్లో రైతులు -ఎంపీ రఘువీరారెడ్డి
-
శిల్పాశెట్టి దంపతులపై కేసు నమోదు