తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రాంచందర్ రావు కీలక వ్యాఖ్యలు

పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మక్తల్ ప్రాంతానికి చెందిన వివధ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు టీబీజేపీ చీఫ్ రాంచందర్ రావు సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. వీరందరికీ బీజేపీ( తెలంగాణ) అధ్యక్షులు రాంచందర్ రాంచందర్ రావు కాషాయపు కండువా కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ’ తల్లి లాంటి బీజేపీ పార్టీకి ద్రోహం చేయొద్ధని కమలం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు హితవు పలికారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అలవీకాని హామీలను ప్రజలపై కురిపించారు. ఎన్నో అబద్ధపు హామీలను ప్రకటించింది. తీరా అధికారంలోకి వచ్చాక ఏడాదిన్నరగా అన్ని వర్గాలను మోసం చేస్తుంది. బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ల అమలు చేయాలని బీజేపీ తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని’ ఆయన అన్నారు. రిజర్వేషన్లకు వ్యతిరేకం అని బీజేపీపై ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు సోయి తెచ్చుకుని మాట్లాడాలి. అడుగడుగున ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ మనల్ని పెద్దదొంగ అని అన్నారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో, పంచాయితీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ప్రజలు బుద్ధి చెప్తారు. బీజేపీపై తప్పుడు ప్రచారం చేయడమే బీఆర్ఎస్ ,కాంగ్రెస్ లకు పని. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తోన్న తరుణంలో ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులు వీటికి సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు. మోదీ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చాక అన్ని రాష్ట్రాలకు సరిపడా యూరియా పంపిణీ చేస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలో రబీ సీజన్ కోసం 9.5 లక్షల టన్నుల యూరియా అవసరమైతే కేంద్రం 12.02లక్షల టన్నుల యూరియాను సరఫరా చేస్తుందని ఆయన గుర్తు చేశారు. కొంత మంది ఎరువులను బ్లాక్ మార్కెట్ లో అమ్ముకున్నారని ఆయన ఆరోపించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ వైపల్యమని రాంచందర రావు ఆరోపించారు.
Related News
-
సీఎం పడ్నవీస్ సతీమణి డ్రస్ పై సోషల్ మీడియాలో చర్చ
-
చిరునవ్వుతోనే మత్తెక్కిస్తోన్న ప్రగ్యా జైస్వాల్
-
అల్లరి నరేష్ హీరోగా సరికొత్త మూవీ
-
రోడ్లపై రైతులు.. స్టార్ హోటల్‌లో మంత్రులు-మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
-
నేను బీఆర్ఎస్ లోనే ఉన్నా-ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
-
గణేశ్ లడ్డూను దక్కించుకున్న ముస్లిం మహిళ