పోడు రైతులను అరెస్ట్ చేయడం పిరికిచర్య- డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

పల్లవి, వెబ్ డెస్క్ : తమ పోడు భూములకు పట్టాలిచ్చి,అటవీ అధికారుల దౌర్జన్యాల నుండి రక్షణ కల్పించాలని కోరుతూ,రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవడానికి దిందా గ్రామం నుండి హైదరాబాద్ కు 400 కిలోమీటర్ల పాదయాత్రగా వెళ్తున్న పోడు రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయడం పిరికిచర్య అని బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఖండించారు. రైతులను అక్రమంగా అరెస్ట్ చేసి మూడు బస్సుల్లో రైతులను తిరిగి ఆసిఫాబాద్ కు తరలించడం దారుణమైన చర్యగా పేర్కొన్నారు.రైతులు తమ బాధలు చెప్పుకోవడానికి వస్తే అరెస్ట్ చేయడమేంటన్నారు. ముఖ్యమంత్రి బాధలు వినాల్సింది పోయి, న్యాయం చేయకుండా పోలీసులచే అరెస్టు చేయడం దారుణమన్నారు.
రైతు డిక్లరేషన్ పేరు చెప్పి రైతులకు బేడీలు వేసి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. లగచర్లలో,గద్వాలలో రైతులకు బేడీలు వేసిన ప్రభుత్వం నేడు దిందా రైతులను అరెస్ట్ చేసిందన్నారు.గతంలో కేసిఆర్ పాలనలో రైతులు స్వర్ణయుగం చూసారని,రేవంత్ రెడ్డి వచ్చాక రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ పాలనలో 550 మంది రైతులు మరణించారని గుర్తు చేశారు.నిజంగా రేవంత్ రెడ్డి మానవత్వం ఉన్న ముఖ్యమంత్రి అయితే రైతులను కలిసి మాట్లాడి వారి సమస్యలకు పరిష్కారం చూపేవారన్నారు.రేవంత్ రెడ్డికి మానవత్వం లేదన్నారు.
వరంగల్ డిక్లరేషన్ లో రైతుల గురించి మాట్లాడిన రాహుల్ గాంధీ,రాజ్యాంగం పట్టుకొని జీవించే హక్కు ఆర్టికల్ 21 గురించి మాట్లాడుతున్నారని, కానీ తెలంగాణలో రైతులు తమ బాధలు చెప్పుకుందామంటే అరెస్ట్ చేస్తున్నారని వాపోయారు.బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి,దిందా గ్రామ బిసిలు భూముల గురించి అడిగితే మాత్రం అరెస్ట్ చేయడం,బిసిలకు మోసం చేయడం కాదా అని నిలదీశారు.రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి నిరసన,ధర్నాలు చేయలేదని శాంతియుతంగా వారి సమస్యల కోసం పాదయాత్ర చేస్తే అరెస్ట్ చేయడం దారుణమన్నారు.
బిజెపి ఎమ్మెల్యే వారి ఓట్లతో గెలిచి, ఈ రోజు వారి గురించి మాట్లాడడంలేదని విమర్శించారు.కేంద్ర ప్రభుత్వం దృష్టికి,కేంద్ర అటవీ శాఖ మంత్రికి ఈ విషయాన్ని ఎందుకు చేరవేయడం లేదని,ఎందుకు న్యాయం చేయడంలేదని నిలదీశారు.వెంటనే ప్రభుత్వం రైతులను విడుదల చేయాలని,వారికి పోడు భూములపై హక్కులు కల్పించి న్యాయం చేయాలన్నారు.రైతులను ఇబ్బంది పెడుతున్న అటవీ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.రైతుల వెంట బిఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ఉంటుందన్నారు.
Related News
-
చిరునవ్వుతోనే మత్తెక్కిస్తోన్న ప్రగ్యా జైస్వాల్
-
అల్లరి నరేష్ హీరోగా సరికొత్త మూవీ
-
రోడ్లపై రైతులు.. స్టార్ హోటల్లో మంత్రులు-మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
-
నేను బీఆర్ఎస్ లోనే ఉన్నా-ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
-
గణేశ్ లడ్డూను దక్కించుకున్న ముస్లిం మహిళ
-
CSR నిధులతో గురుకులాలు అభివృద్ధి – మంత్రి దామోదర