pallavinews
Pallavi E-Paper E-PAPER
  • Home Icon
  • తెలంగాణ
  • హైదరాబాద్‌
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • అంతర్జాతీయం
  • ఫోటో గ్యాలరీ
  • వీడియోలు
pallavi news search-icon
  • pallavi news facebook-icon
  • pallavi news Twitter-icon
  • pallavi news whatsapp-icon
  • pallavi news instagram-icon
  • pallavi news youtube-icon
pallavi news trending-icon

Trending

  • బిగ్ బాస్ 8 తెలుగు
  • హైడ్రా
  • సీఎం రేవంత్ రెడ్డి
  • Home »
  • Breaking News »
  • A Shocking Twist In The Vishal Sai Dhansika Love Story

విశాల్ – సాయి ధన్సిక ప్రేమకథలో షాకింగ్ ట్విస్ట్..!

విశాల్ – సాయి ధన్సిక ప్రేమకథలో షాకింగ్ ట్విస్ట్..!
  • Edited By: Pallavi,
  • Published on August 30, 2025 / 04:00 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

పల్లవి, వెబ్ డెస్క్ : సహజంగా క్రీడల్లో కానీ  సినిమాల్లో కానీ ఆయా రంగాల ద్వారా పరిచయమై మొదట స్నేహితులుగా మారడమో లేదా  ప్రేమలో పడటం, పెళ్లి చేసుకోవడం సినీ క్రీడా  రంగాల్లో ఇవి సర్వ సాధారణమైన విషయం. సినిమా విషయానికి వస్తే అజిత్–శాలిని, సూర్య–జ్యోతిక, నయనతార–విగ్నేష్ శివన్ వంటి జంటలు ప్రేమించి పెళ్లి చేసుకొని చాలా మందికి ఆద‌ర్శంగా నిలిచారు. వీరు సినిమా చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో ప్రేమ‌లో ప‌డి పెళ్లి చేసుకున్నారు.

కానీ సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ తమిళ స్టార్ హీరో విశాల్ – హీరోయిన్ సాయి ధన్సిక జంట మాత్రం  ఈ ట్రెండ్‌కు భిన్నంగా నిలిచింది. ఈ ఇద్దరూ ఒక్క సినిమాలో కూడా కలిసి నటించలేదు. అయినా, వారిద్దరి మధ్య 8 ఏళ్లుగా గాఢమైన ప్రేమ సాగుతూ వ‌స్తుంది.. తాజాగా వీరి ఎంగేజ్మెంట్ ముగిసింది. త్వరలోనే పెళ్లి వేడుక జరగనుంది. అయితేవిశాల్, ధన్సిక కలిసి నటించకపోయినా… ఒక సంఘటన ద్వారా వారిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు. ఈ ప్రేమ కథకు నాంది పడింది 2017లో ‘విజితిరు’ సినిమా సమయంలో. ఆ సినిమాలో సాయి ధన్సిక నటించగా, ప్రెస్‌మీట్‌లో జరిగిన ఘటన ఆమె జీవితానికే మలుపు తిప్పింది.

విజితిరు ప్రమోషన్ ఈవెంట్‌లో వేదికపై మాట్లాడిన ధన్సిక, అంద‌రికి కృతజ్ఞతలు చెప్ప‌గా, టీ. రాజేందర్ పేరును అనుకోకుండా మర్చిపోయింది. దీంతో ఆయన బహిరంగంగా ధన్సికపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “సీనియర్లను గౌరవించడం తెలియదా?” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. త‌ర్వాత ఆమె క్షమాపణ చెప్పినప్పటికీ, రాజేందర్ ఆగ్రహం చల్లబడలేదు.ఈ ఘటన తర్వాత సినిమాటిక్ స్టైల్లో రంగంలోకి దిగిన వ్యక్తి విశాల్. ఆ సమయంలో తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఉన్న ఆయన, ధన్సికకు మద్దతుగా నిలిచాడు.

యువ తారలను ప్రోత్సహించాల్సిన పెద్ద‌వాళ్లు ఇలా అవమానించడంపై తీవ్రంగా స్పందించాడు. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య బంధం బలపడింది. అప్పటి సంఘటన తర్వాత ఇద్ద‌రు చాలా క్లోజ్ అయ్యారు. ఆపై విశాల్ – సాయి ధన్సిక 8 ఏళ్ల పాటు ప్రేమలో ఉండగా, ఈ విషయాన్ని పెద్దగా బయటపెట్టలేదు. ఇప్పుడు ఎంగేజ్మెంట్‌తో ప్రేమకథను అధికారికం చేశారు. త్వరలోనే ఈ జంట పెళ్లి పందిరిలోకి అడుగుపెట్టనుంది.

 

pallavi news whatsappPallavi News వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Tag

  • #news
  • big news
  • breaking news
  • film news
  • kollywood

Related News

  • ‘కణ్మని’ పాత్ర నాకు ఎప్పటికీ ప్రత్యేకం -‘ఓజీ’ హీరోయిన్ ప్రియాంక మోహన్

  • టీటీడీ పాలక మండలి నిర్ణయాలు

  • జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ సన్నాహక సమావేశం

  • డబ్బు కోసం ఆ పని చేయను – తనుశ్రీ దత్తా

  • ఛాయ్ వాలా టూ ప్రధాని – స్పెషల్ స్టోరీ

  • సూపర్ -4 కు టీమిండియా

Latest
  • కౌమార బాలికల సాధికారతపై అవగాహన కార్యక్రమం

  • నడకతో గుండె భద్రం..!

  • రూ.100 కోట్ల క్లబ్ లో మిరాయ్

  • సినిమాల తయారీ ఇక సులభతరం -FDC ఛైర్మన్ దిల్ రాజ్

  • లేటెస్ట్ గా అనసూయ ..!

  • ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

  • జూబ్లీహిల్స్ టిక్కెట్ నాకే – కాంగ్రెస్ ఎంపీ

  • వాహన మిత్ర పథకానికి అర్హులు వీళ్లే..?

  • హోం మంత్రి అనితపై మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు

  • మాట ఇచ్చారు. నెరవేర్చారు

Pallavi News
Address:
100 feet road, Kavuri Hills Phace- 3, Sriramana colony, Madhapur, Hyderabad, Telengna- 500081
epaper@pallavimedia.com.
www.pallavinews.com
Ph: 63013 12393
  • Telangana
  • Andhra Pradesh
  • Hyderabad
  • International
  • Life style
  • Sports
  • Crime
  • Photo gallery
  • Education
About Us Contact Us Privacy Policy