‘కణ్మని’ పాత్ర నాకు ఎప్పటికీ ప్రత్యేకం -‘ఓజీ’ హీరోయిన్ ప్రియాంక మోహన్

పల్లవి, వెబ్ డెస్క్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘ఓజీ’. డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఓజాస్ గంభీరగా పవన్ కళ్యాణ్ శక్తివంతమైన పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తున్నారు. సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానున్న ‘ఓజీ’ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. త్వరలో ట్రైలర్ విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాల్లో జోరు పెంచింది. ఈ నేపథ్యంలో తాజాగా కథానాయిక ప్రియాంక అరుళ్ మోహన్ పాత్రికేయులతో ముచ్చటించి చిత్రానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.