రూ.100 కోట్ల క్లబ్ లో మిరాయ్

పల్లవి, వెబ్ డెస్క్ : తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ సంయుక్తంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మించిన లేటెస్ట్ మూవీ మిరాయ్. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ యువ హీరోలు తేజా సజ్జా, మంచు మనోజ్, శ్రీయ సరన్ నటించిన ఈ మూవీ పురాణాల ఆధారంగా సోషల్ ఫాంటసీ తో తెరెక్కింది.
ఈ చిత్రంలో సీనియర్ స్టార్ హీరోయిన్ శ్రీయ సరన్ తొలిసారి తల్లి పాత్రలో, రితీక నాయక్ హీరోయిన్‌గా నటించారు. సీనియర్ నటుడు, హీరో జగపతి బాబు, జయరాం, దర్శకులు తిరుమల కిషోర్, వెంకటేష్ మహా, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సెప్టెంబర్ 12వ తేదీన పాన్ ఇండియామూవీగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజై కలెక్షన్ల సునామీని సృష్టిస్తుంది.
మిరాయ్ మూవీ మొత్తం వంద కోట్ల క్లబ్ లో దూసుకెళ్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.91.45కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మూవీ మేకర్స్ తెలిపారు. తొలి మూడు రోజుల్లో ఎనబై రెండు కోట్లకుపైగా వసూళ్లు చేసిన ఈ చిత్రం నాలుగో రోజు మాత్రం పదికోట్లకు పైగా కలెక్ట్ చేయడం విశేషం అని సినీ క్రిటిక్స్ అంటున్నారు.