pallavinews
Pallavi E-Paper E-PAPER
  • Home Icon
  • తెలంగాణ
  • హైదరాబాద్‌
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • అంతర్జాతీయం
  • ఫోటో గ్యాలరీ
  • వీడియోలు
pallavi news search-icon
  • pallavi news facebook-icon
  • pallavi news Twitter-icon
  • pallavi news whatsapp-icon
  • pallavi news instagram-icon
  • pallavi news youtube-icon
pallavi news trending-icon

Trending

  • బిగ్ బాస్ 8 తెలుగు
  • హైడ్రా
  • సీఎం రేవంత్ రెడ్డి
  • Home »
  • Editorial »
  • Chai Wala To Pm Special Story

ఛాయ్ వాలా టూ ప్రధాని – స్పెషల్ స్టోరీ

ఛాయ్ వాలా టూ ప్రధాని – స్పెషల్ స్టోరీ
  • Edited By: Pallavi,
  • Published on September 16, 2025 / 04:13 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

పల్లవి, వెబ్ డెస్క్ : ప్రతి వాడు గొప్పవాడు కాగలడు, చరిత్ర సృష్టించగలడు , పేదవాళ్లకు సేవ చేయగలడు అని మార్టిన్ లూథర్ కింగ్ నాడు చెప్పిన మాటలను నేటి భారతంలో నిజం చేసిన మేటి వరల్డ్ లైక్ లీడర్ అతను.*ఛాయ్ వాలా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ప్రపంచానికే నాయకత్వ మార్గాన్ని చూపించిన లోక్ నాయకుడు అతను”.317ఆర్టికల్ రద్ధుతో భారతీయులంతా ఒకేటే ఎక్కడైనా సగర్వంగా జీవించవచ్చు అని చాటిన,*త్రిపుల్ తలాక్ రద్ధుతో ముస్లీం మహిళల జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చిన,ఆత్మ నిర్భర భారత్, వికసిత్ భారత్ లక్ష్యాలతో అఖండ భారతావని భవిష్యత్తును మార్చాలనుకునే మేటి నేత ఆయన.* 2016లో సర్జికల్ స్ట్రైక్ తో శత్రుదేశం పాక్ కు దడ పుట్టించిన ఆర్ఎస్ఎస్ ప్రచారకుడి నుంచి ప్రధానిగా ఎదిగిన ఓ సామాన్య కార్యకర్త అతను.

నోట్ల రద్ధుతో బ్లాక్ మనీ దారుల గుండెల్లో రైళ్ళు పరుగెత్తించిన , జీఎస్టీ అమలు, అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు అమలు చేసిన తొలి ప్రధాని అతను.అతనే ‘నరేంద్ర దామోదరదాస్ మోదీ’ .. 1950 సెప్టెంబరు 17న దామోదర‌దాసు ముల్చందు మోదీ , హీరాబెను మోదీ దంపతులకు జన్మించిన ఆరుగురు సంతానంలో మూడోవాడు మోదీ.

పూవు పుట్టగానే పరిమిళిస్తున్నట్లు మోదీ బాల్యంలోనే నాయకత్వ లక్షణాలను అలవరుచుకున్నారు. ఎనిమిదేళ్ల వయసులోనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)లో అడుగుపెట్టి భారతీయ సంప్రదాయ ఆచారాల పరిరక్షణే నడుం బిగించారు.సమాజానికి తన అవసరం వచ్చిన ప్రతిసారి నేనున్నాను అంటూ సేవ చేస్తూ ప్రజలకు చేరువయ్యారు. ఆర్ఎస్ఎస్ ను ప్రజాసంఘ్ గా మార్చి ప్రజలతో మమైకం అయ్యేలా చేశారు.

మోదీ గురించి చెబితే భారతం, రాస్తే రామాయణం . సింపుల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి వాడు గొప్పవాడు కాగలడు, చరిత్ర సృష్టించగలడు , పేదవాళ్లకు సేవ చేయగలడు అని అమెరికన్ గాంధీ మార్టిన్ లూథర్ కింగ్ నాడు చెప్పిన మాటలను నేటి భారతంలో నిజం చేసిన మేటి వరల్డ్ లైక్ లీడర్ మోదీ.ఛాయ్ వాలా నుంచి ప్రధానిగా ఎదిగిన ఆయన అసాధ్యాలను సుసాధ్యాలుగా మార్చిన మోదీ ఆర్ఎస్ఎస్ ను శాఖాలుగా విస్తరించడంలో తనవంతు కృషి చేశారు మోదీ.

టెర్రరిజంతో ప్రపంచ దేశాలను వణికించే శత్రుదేశం పాకిస్థాన్ పై సర్జికల్ స్ట్రైక్ , ఆపరేషన్ సింధూర్ తో వెన్ను వణుకుపుట్టించిన, అప్పులతో బలహీన దేశాలను ముంచేసే చైనా లాంటి దేశాలకు ధీటుగా సమాధానం ఇచ్చిన అపర రాజకీయ జ్ఞాని మేటి లీడర్ మోదీ.గాంధీగిరితో ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ పుట్టిన నేల గుజరాత్ లో పుట్టిన మోదీ నేడు నమోః నమామి .. తదాస్త్ స్మరామి అంటుంది నేడు దేశం.

ఛాయ్ వాలా నుంచి ప్రధానిగా ఎదిగిన నరేంద్ర మోదీ 75వ జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన సాధించిన ఘనతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.గుజరాత్ చరిత్రలోనే 11 ఆగస్టు 1979 మరిచిపోలేని రోజు అది. ఆ రోజు మధ్యాహ్నాం మూడు గంటల పదినిమిషాలకు మచ్చు డ్యామ్ స్థాయికి మించిన వరదతో తెగిపోయి మోర్బి పట్టణం మునిగిపోయింది. వేలాది మంది ప్రాణాలను కోల్పోయి, కొన్ని వేల మంది నిరాశ్రయులయ్యారు.అప్పటికే ఆర్ఎస్ఎస్ లో పనిచేస్తున్న 28ఏళ్ళ యువకుడు చెన్నై నుంచి గుజరాత్ లోని మోర్బీ పట్టణానికి చేరుకుని తనకు నెట్ వర్క్ తో చేసిన సేవా కార్యక్రమాలు నేటీ భారతానికి స్ట్రాంగ్ లీడర్ గా ప్రధాని అవ్వడానికి బీజం పడింది.

నాడు చేసిన సేవా కార్యక్రమాలతో ఆర్ఎస్ఎస్ పై ప్రజలందరిలోనూ ఓ సరికొత్త నమ్మకమే కాదు ఆలోచన కలిగి నమ్మకం పెరిగింది. అతడే మోదీ.ఆ తర్వాత 1984లో అప్పటి గుజరాత్ ప్రభుత్వం రైతులు గుజరాత్ వెలుపల ఆహార ధాన్యాలను అమ్మకాన్ని నిషేధం లాంటి వివాదస్పద నిర్ణయాన్ని తీసుకుంది. 1930లో బ్రీటీష్ ప్రభుత్వం ఉప్పుపై పన్ను విధించడంతో దండి మార్చ్ చేసి బ్రిటీష్ ప్రభుత్వాన్ని మహాత్మా గాంధీ కదిలించినట్లుగా వివాదస్పద చట్టాన్ని ఉల్లంఘించేలా గుజరాత్ రైతులను కదిలించారు మోదీ.

1987లో గుజరాత్ బీజేపీ జనరల్ సెక్రటరీ పదవికి మోదీ ఎంపికయ్యారు.తొలిసారిగా తాను ఎదుర్కున్న పరీక్ష అహ్మదాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలు.ఇది ఆయనకు తొలి రాజకీయ పరీక్ష. ఆ ఎన్నికల్లో అద్భుతం జరిగి మొత్తం 127 మున్సిపల్ వార్డులకు గానూ బీజేపీ 67 వార్డులను గెలుచుకుని సరికొత్త చరిత్రను లిఖించారు మోదీ.అప్పటివరకూ పదమూడు వార్డులనే గెలుచుకున్న బీజేపీ ఏకంగా మోదీ నాయకత్వంలో అహ్మదాబాద్ మేయర్ కుర్చీనే దక్కించుకుంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్న అతిపెద్ద రెండు నిర్ణయాలు గుజరాత్ భవిష్యత్తునే కాదు దేశ భవిష్యత్తుకు బాటలు పడ్డాయి

మంత్రివర్గంలో చోటు దక్కని ఎమ్మెల్యేలకు ఏదోక బోర్డులోనో, కార్పోరేషన్ లోనో చోటు కల్పించే పాతపద్ధతికి స్వస్తి పలికారు. బ్యూరోక్రాట్లకు బాధ్యతలు ఇచ్చి ప్రజలకు సేవలను అందించారు మోదీ. రైతులకు నాలుగు గంటల కరెంటూ ఇవ్వాలనే రెండో కఠినమైన నిర్ణయాన్ని తీసుకుని అందర్నీ అబ్బురపరిచారు. అప్పుడు సర్వత్రా వ్యతిరేకత వెల్లివెత్తుతున్న సమయంలో మోదీ అన్న మాటలు ” ఇప్పుడు ప్రజలు, రైతులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు కానీ పదేండ్ల తర్వాత వారే మెచ్చుకుంటారు” అని అన్నారు. మోదీ అన్నట్లుగానే అందరూ శభాష్ అని కీర్తించారు.

అప్పటి నుంచి ఇప్పటివరకూ మోదీ తీసుకున్న నిర్ణయాల్లో అదే పట్టుదల, ధైర్యం కన్పిస్తాయి.  అప్పటివరకూ భారత్ అంటే కాంగ్రెస్ .. కాంగ్రెస్ అంటే భారత్ అనే విధంగా ఉన్న స్థితిని ఈ దేశ గతిని, రాష్ట్రాల స్థితిని మార్చగలిగే శక్తి ఒక్క బీజేపీకే ఉందని నిరూపిస్తూ 2018వరకు దాదాపు 71% జనాభా ఉన్న రాష్ట్రాల్లో బీజేపీని అధికారంలో నిలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీని తీర్చిదిద్దిన మోదీ బీజేపీ అంటే ఓ రాజకీయ పార్టీ కాదు హిందూత్వ, జాతీయ వాద పార్టీ అని నిరూపించారు.

సఫాయీ కర్మచారులకు పాద పూజ చేసిన, చీపురు పట్టి స్వచ్ఛ భారత్ అంటూ తొలి అడుగు వేసిన ప్రధానిగా మోదీ నిలిచారు. ప్రధాని అంటే ప్రోటోకాల్ కాదు ప్రజలకు దగ్గరగా ఉండే సామాన్యుడే.అని తన తీరుతో నిరూపించారు. ప్రధాని మోదీ మోడల్ కేవలం దేశానికే కాదు ప్రపంచానికి స్ఫూర్తినిస్తుందని బయట దేశాలు కూడా కీర్తిస్తున్నాయి. మోదీ 75వ జన్మదినం సందర్భంగా చేపట్టే సేవా ఫఖ్వాడా కార్యక్రమం కూడా ఇప్పటి తరాలకు, రాబోవు తరాలకు స్ఫూర్తినివ్వడమే కాదు ఈ దేశ స్థితిగతిని మారుస్తుంది అని కమలం శ్రేణులు చెబుతున్నారు.మోదీ ఓ సామాన్యుడు.. ఓ ఛాయ్ వాలా.. ఓ ప్రధాని.. ఓ గ్లోబల్ లీడర్ గా ఎదిగిన ప్రస్థానం భవిష్యత్తు తరాలకు ఆదర్శం.. ఓ చరిత్ర..

pallavi news whatsappPallavi News వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Tag

  • #news
  • big news
  • big update
  • breaking news
  • latest news

Related News

  • ‘కణ్మని’ పాత్ర నాకు ఎప్పటికీ ప్రత్యేకం -‘ఓజీ’ హీరోయిన్ ప్రియాంక మోహన్

  • టీటీడీ పాలక మండలి నిర్ణయాలు

  • జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ సన్నాహక సమావేశం

  • డబ్బు కోసం ఆ పని చేయను – తనుశ్రీ దత్తా

  • సూపర్ -4 కు టీమిండియా

  • కౌమార బాలికల సాధికారతపై అవగాహన కార్యక్రమం

Latest
  • ఛాయ్ వాలా టూ ప్రధాని – స్పెషల్ స్టోరీ

  • నడకతో గుండె భద్రం..!

  • రూ.100 కోట్ల క్లబ్ లో మిరాయ్

  • సినిమాల తయారీ ఇక సులభతరం -FDC ఛైర్మన్ దిల్ రాజ్

  • లేటెస్ట్ గా అనసూయ ..!

  • ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

  • జూబ్లీహిల్స్ టిక్కెట్ నాకే – కాంగ్రెస్ ఎంపీ

  • వాహన మిత్ర పథకానికి అర్హులు వీళ్లే..?

  • హోం మంత్రి అనితపై మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు

  • మాట ఇచ్చారు. నెరవేర్చారు

Pallavi News
Address:
100 feet road, Kavuri Hills Phace- 3, Sriramana colony, Madhapur, Hyderabad, Telengna- 500081
epaper@pallavimedia.com.
www.pallavinews.com
Ph: 63013 12393
  • Telangana
  • Andhra Pradesh
  • Hyderabad
  • International
  • Life style
  • Sports
  • Crime
  • Photo gallery
  • Education
About Us Contact Us Privacy Policy