నడకతో గుండె భద్రం..!
Walking

పల్లవి, వెబ్ డెస్క్ : ప్రతి రోజూ లేవగానే కాలకృత్యాలు తీర్చుకుని ఉదయం పూట కనీసం ముప్పై నిమిషాల పాటు మార్నింగ్ వాకింగ్ చేస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఫిటినెస్ నిపుణులు సూచిస్తున్నారు. అలాగే అన్ని వయసుల వారు చేయదగ్గ వ్యాయామం వాకింగ్ . కానీ నెమ్మదిగా వాకింగ్ చేసేవారి కంటే వేగంగా వాకింగ్ చేసేవారికి గుండె జబ్బు వచ్చే ప్రమాదం తక్కువ అని వైద్య నిపుణులు చెబుతున్నారు.
వేగంగా నడవడం అనేది మన బలానికి ఒక కొలమానం. వ్యాయామంలో భాగంగా వేగంగా నడిస్తే గుండెతో పాటు శరీరంలో ఇతర అవయవాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. వేగంగా నడవడం అంటే మూడ్ స్వింగ్స్ , జ్ఞాపకశక్తి , నిద్రకు మేలు చేస్తుంది. సాధారణంగా గుండె రక్తనాళాలపై తీవ్రమైన ఒత్తిడి కలిగినప్పుడు స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. వేగంగా నడవడం వల్ల మెదడుకు రక్తాన్ని పంప్ చేసే నరాల పనితీరు మెరుగవుతుంది.
ఫలితంగా ఒత్తిడి, అలసట తగ్గుతుంది. శరీర దిగువ భాగంలో కండరాలు బలంగా తయారవుతాయి. వేగంగా నడిస్తే శరీరంలో కేలరీలు అధికంగా ఖర్చవ్వడం వల్ల బరువు తగ్గే అవకాశాలు ఎక్కువ.