ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

పల్లవి, వెబ్ డెస్క్ : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వాహనమిత్ర కింద ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ పదిహేను వేలు ఇచ్చేందుకు మార్గదర్శకాలను రాష్ట్రప్రభుత్వం జారీ చేసింది.
ఈనెల పదమూడో తారీఖు నాటికి ఉన్న పాత జాబితాను ప్రభుత్వం పరిశీలించనున్నది. అయితే కొత్తవారు ఈనెల పదిహేడో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు ఆన్ లైన్ లో ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులను గుర్తించడానికి ఈనెల ఇరవై రెండో తారీఖు వరకు క్షేట్రస్థాయి పరిశీలన చేసి ఇరవై నాలుగో తారీఖున అర్హుల జాబితాను ప్రకటించనున్నది. వచ్చే నెల అక్టోబర్ ఒకటో తారీఖున నగదు ఆయా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అయితే ఈ పథకానికి రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల తొంబై వేల మంది లబ్ధిదారులగా అర్హులైనట్లు తెలుస్తోంది.
Related News
-
జూబ్లీహిల్స్ టిక్కెట్ నాకే – కాంగ్రెస్ ఎంపీ
-
వాహన మిత్ర పథకానికి అర్హులు వీళ్లే..?
-
హోం మంత్రి అనితపై మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు
-
మాట ఇచ్చారు. నెరవేర్చారు
-
కేబుల్ ఆపరేటర్ల సమస్యలను పరిష్కరించాలి – ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్
-
మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం అభివృద్ధి -మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి