సూపర్ -4 కు టీమిండియా
Team India

పల్లవి, వెబ్ డెస్క్ : దుబాయి వేదికగా జరుగుతున్న ఆసియా కప్ లో టీమిండియా సూపర్4 కు దూసుకెళ్లింది. తాజాగా ఓమన్ తో జరిగిన మ్యాచ్ లో యూఏఈ ఘనవిజయం సాధించింది. దీంతో భారత్ కు లైన్ క్లియర్ అయింది. ఓమన్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో యూఏఈ జట్టు ఇరవై ఓవర్లో ఐదు వికెట్లను కోల్పోయి 174 పరుగులు చేసింది. 175పరుగుల లక్ష్యం చేధనతో బరిలోకి దిగిన ఓమన్ జట్టు 18.4 ఓవర్లకు 130పరుగులు చేసి కుప్పకూలిపోయింది.