టీటీడీ పాలక మండలి నిర్ణయాలు

పల్లవి, వెబ్ డెస్క్ : టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన సమావేశమైన టీటీడీ పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా ఈ నెల 23న ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనున్నట్లు తెలిపింది. అంతేకాకుండా ఈ నెల 24న మీనలగ్నంలో ధ్వజారోహణం కార్యక్రమాన్ని నిర్వహించనున్నది.
ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు సమర్పించనున్నారు. గతం కన్నా వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాం అని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పేర్కొన్నారు.
ఈ బ్రహ్మోత్సవాలకు హజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు దళితవాడల్లో 1000 ఆలయాలు నిర్మించాలని తీర్మానించారు. అయితే మొదటిసారి బ్రహ్మోత్సవాలను ఇస్రో పరిశీలిస్తుంది.టీటీడీపై నిరాధార ఆరోపణలు చేస్తే క్రిమినల్ కేసులు పెడతామని ఆయన అన్నారు.