హోం మంత్రి అనితపై మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు
పల్లవి, వెబ్ డెస్క్ : ఏపీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చే నూతన పీపీపీ విధానం వల్ల ఏ ఒక్క సీటూ పేదలకు దక్కకుండా పోదని హోం మంత్రి అనిత అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ ” గత వైసీపీ ఐదేండ్ల ప్రభుత్వ పాలనలో చేసిన పాపాల వల్లే వైద్య కళాశాలల్లో ఒక్క అడ్మిషనూ ఇవ్వలేకపోయాం . మెడికల్ కాలేజీల భవనాల్లో నలబై ఏడు శాతమే పనులు జరిగాయి. ఫ్యాకల్టీ, ల్యాబ్స్ , లైబ్రరీ లేదని అడ్మిషన్ ఇవ్వలేమని నేషనల్ మెడికల్ కౌన్సిల్ నివేదిక ఇచ్చింది. మెడికల్ కాలేజీలకు ఇవ్వాల్సిన సొమ్మును వేరేవాటికి ఉపయోగించారని” ఆరోపించారు.
వైసీపీ పై హోం మంత్రి అనిత చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత ఆర్కే రోజా కౌంటరిస్తూ ” మీకు దమ్ముంటే రాజమండ్రి, విజయనగరం, నంద్యాల, మచిలీపట్నం, పాడేరు మెడికల్ కాలేజీలకు రండి?. కాలేజీలు ఎలా ఉంటాయి?. ఎలా కట్టాలి? అక్కడ చదువుతున్న విద్యార్థులు ఎవరెవరో చూపిస్తారు?. పిచ్చి పిచ్చి వీడియోలు చేసి మాట్లాడుతున్నావు. నువ్వు అసలు యాంకరవా.?. హోం మంత్రివా? జగన్ గారి గురించి మాట్లాడే అర్హత మీకుందా” అని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.



