కౌమార బాలికల సాధికారతపై అవగాహన కార్యక్రమం

పల్లవి, వెబ్ డెస్క్ : హైదరాబాద్ బేగంపేటలోని ప్రజా భవన్లో కౌమార బాలికల భద్రత, ఆరోగ్యం, పోషణ, సాధికారతపై రాష్ట్రస్థాయి అవగాహన కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమం సెర్ప్, , మహిళా-శిశు అభివృద్ధి శాఖ, యూనిసెఫ్ ఆధ్వర్యంలో డీఆర్డీఓలు, అదనపు డీఆర్డీఓలు, డీడబ్ల్యూల కోసం అవగాహన కల్పించనున్నారు.
ఈ అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పాల్గొని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ “మహిళా స్వయం సహాయక సంఘాల తరహాలో కౌమార బాలికా సంఘాల ఏర్పాటు పై దిశా నిర్దేశం చేశారు. ఆమె ఇంకా మాట్లాడుతూ ” 14 నుంచి 18 ఏండ్ల మధ్య వయసు జీవితంలో అత్యంత కీలక దశ.ఇది జీవితాన్ని మలుపు తిప్పే దశ.అమ్మాయిల్లో శారీరకంగా, మానసికంగా, భావోద్వేగంగా ఈ దశ అత్యంత సంక్లిష్టమైనది” అని అన్నారు.
ఈ సమయంలో సరైన దారి చూపితే బాలిక సమాజానికి మార్గదర్శకురాలవుతుంది.కౌమార బాలికలు ఎన్నో సవాళ్లు ఎదుర్కుంటారు.బాల్య వివాహాలు, చదువును ఆపేయడం, రక్తహీనత, పోషకార లోపం, ఆరోగ్య సంబంధిత సమస్యలు, వేధింపులకు గురయ్యే ప్రమాదం ఎదుర్కొంటారు.ఈ సమస్యలు కౌమార బాలిక ఎదుగుదలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి.ప్రతి బాలికకు అవకాశాలు కల్పించడమే నిజమైన సాధికారత.అందుకే మహిళా స్వయం సహాయక సంఘాల తరహాలోనే కిశోర బాలికల సంఘాలు ఏర్పాటు చేయాలి.కిశోర బాలికల భద్రత, పోషకాహారం, ఆరోగ్యం, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పన కావాలంటే కిశోర బాలికల సంఘాలు ఏర్పాటు చేయాలి.సంఘాల ఏర్పాటులో డీఆర్డీఓలు, డీడబ్ల్యూ లు కలిసి పని చేయాలి.కిశోర బాలికల సంఘాలు ఏర్పాటు తో వారి సమస్యలు తెలుసుకుని అవగాహన కార్యక్రమాలు చేసే వెసులుబాటు కలుగుతుంది అని తెలిపారు.