నీట్లో డీపీఎస్ ప్రభంజనం
 
                                
పల్లవి, హైదరాబాద్: నీట్ ఫలితాల్లో నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ క్యాంపస్ విద్యార్థులు అత్యుత్తమ స్కోర్ సాధించి సత్తా చాటారు. 8 మంది విద్యార్థులు 600 కంటే ఎక్కువ స్కోర్ తెచ్చుకోవడం విశేషం. 720కి గానూ 705 స్కోర్ సాధించి హనా ఫరియాల్ జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. తమ స్కూల్ విద్యార్థులు జాతీయ స్థాయిలో మంచి స్కోర్ సాధించినందుకు సంతోషంగా ఉందని ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ చైర్మన్ మల్క కొమురయ్య, సీఈఓ మల్క యశస్వి, సీనియర్ ప్రిన్సిపల్ సునీత రావు హర్షం వ్యక్తం చేశారు. నీట్ లో అసాధారణమైన స్కోర్ సాధించిన విద్యార్థులకు, అందుకోసం కృషి చేసిన టీచర్లకు డీపీఎస్ చైర్మన్ కొమురయ్య అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సునీతా రావు మాట్లాడుతూ.. డీపీఎస్ నాచారం క్యాంపస్ విద్యార్థులకు అవిశ్రాంతంగా మద్దతునివ్వడంతో పాటు మార్గనిర్దేశం చేసిందని, విద్యార్థుల కృషి, అంకితభావం, పట్టుదల వారు బలమైన కెరీర్ వైపు ముందడుగు వేయడానికి సహాయపడటమే కాకుండా స్కూలుకు గుర్తింపు తెచ్చిపెట్టాయని అన్నారు.

 
          



