నాచారం DPSలో ఘనంగా ఎర్త్ డే వేడుకలు
నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఎర్త్ డే వేడుకలను ఘనంగ నిర్వహించారు. 5, 6 తరగతుల విద్యార్థులు చేసిన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన మూకాభినయం..జీవకోటి మనుగడకు ప్రకృతి పరిరక్షణ ఆవశ్యకతను కళ్లకు కట్టినట్టుగా చూపించింది. పర్యావరణ సమతుల్యతను కాపాడడం మన కర్తవ్యం అంటూ విద్యార్థులు చేసిన ప్రతిజ్ఞ స్ఫూర్తిదాయకంగా నిలిచింది. పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల పాత్ర యొక్క ఆవశ్యకతను స్కూల్ ప్రిన్సిపల్ పద్మజ్యోతి అద్భుతంగా వివరించారు.




