నాచారం DPSలో గ్రాండ్గా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్
నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు గ్రాండ్గా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా బాగయ్య, శేఖర్ రెడ్డి, చిన్నం రాజు, జయతీర్థ పాల్గొన్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అదేవిధంగా విద్యార్థుల ప్రసంగాలు అతిథుల ప్రశంసలను పొందాయి. ఈ సందర్భంగా చైర్మన్ కొమరయ్య మాట్లాడుతూ.. మహనీయులను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. రిపబ్లిక్ డే గొప్పతనం, విద్యార్థులు ఎలా ఉండాలనే దానిపై అతిథులు ఇచ్చిన ప్రసంగాలు ఆలోచింపజేశాయి. విద్యార్థులలో సేవాగుణాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో చేపట్టిన ‘జాయ్ ఆఫ్ గివింగ్ ‘ కార్యక్రమం అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఆటలు, విద్యలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను మేనేజ్మెంట్ బహుమతులతో సత్కరించింది.




