ది లిట్ కేఫ్ ఇంక్ -స్పైర్డ్ సిప్స్.
ది లిట్ కేఫ్ ఇంక్ -స్పైర్డ్ సిప్స్.
ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాచరం 7మరియు 8వ తరగతి విద్యార్థులలో సాహిత్య అభిరుచిని ప్రోత్సహించడానికి ది లిట్ కేఫ్ #ఇంక్ -స్పైర్డ్ సిప్స్ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. గౌరవనీయులైన పాఠశాల సీనియర్ ప్రిన్సిపల్ మరియు ఆర్ .ఆర్ డైరెక్టర్ శ్రీమతి సునీతా రావు మరియు వైస్ ప్రిన్సిపల్ ఐ. సుధా గార్లచే ఈ కేఫ్ 24 డిసెంబర్ 2024 న ప్రారంభించబడింది. ఈ ప్రత్యేక స్థలం నందు పాఠశాలలోని వివిధ రకాల పోటీలు మరియు సాహిత్య కార్యకలాపాలన్ని ఒక ప్రత్యేక వారంలో నిర్వహించబడతాయి. వీటిలో ఏకపాత్రాభినయ ప్రదర్శనలు, పుస్తక సమీక్షలు, కవిత్వ రచనా పోటీలు మరియు పుస్తక కవర్ పేజీ రూపకల్పన పోటీలు ఉన్నాయి.
విద్యార్థులలో ఉత్సాహాన్ని మరియు సాహిత్య సంస్కృతిని ప్రోత్సహించే విధంగా వారిలోని వివిధ రకాల సాహిత్య సృజనాత్మకతను ప్రేరేపించే విధంగా మరియు వారికి స్పష్టమైన అవగాహనను కల్పించడం ఈ కేఫ్ ప్రధాన ఉద్దేశం. లిట్ కేఫ్ ప్రారంభోత్సవ సందర్భంగా సీనియర్ ప్రిన్సిపల్ మరియు ఆర్. ఆర్ డైరెక్టర్ శ్రీమతి సునీతా రావు గారు విద్యార్థులకు అమూల్యమైన సందేశాన్ని అందించారు. ఈ ప్రత్యేక స్థలం కేవలం సాహిత్య వారానికి మాత్రమే అంకితం కాకుండా విద్యార్థులలో సాహిత్య అన్వేషణను మరియు ప్రతిభను పెంపొందించే విధంగా ఈ వేదికపై నిరంతరం కృషి జరగాలని తన భావాన్ని వ్యక్తపరిచారు .



