నాచారం డీపీఎస్ లో స్వాగతోత్సవం
 
                                
పల్లవి, హైదరాబాద్: నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అకడమిక్ ఇయర్ మొదటి రోజు ఎంతో ఉత్సాహభరితంగా సాగింది. పలు కొత్త కొత్త కార్యక్రమాలతో విద్యార్థుల ముఖాల్లో చిరునవ్వులు తీసుకొచ్చింది యాజమాన్యం. వీటిలో గ్రేడ్ 3, 4 విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్కూల్ టీచర్లు క్యాంపస్ మొత్తాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సునీతా రావు మాట్లాడుతూ.. విద్యార్థులు ఈ విద్యా సంవత్సరం కూడా ఉన్నత లక్ష్యాలు ఏర్పాటు చేసుకొని కష్టపడాలని సూచించారు. వైస్ ప్రిన్సిపల్ శిరీష మాట్లాడుతూ.. పాఠశాల విలువలను, మార్గదర్శకత్వం, ప్రోత్సాహాన్ని అందించారు. ఈ సందర్భంగా మొదటి రోజు విద్యార్థులంతా స్కూలులో ఉత్సాహంగా గడిపారు.

 
          



