ఏడో తరగతి విద్యార్థినిపై ముస్లిం యువకుడు లైంగికదాడి..ఇంటిని తగలబెట్టిన గ్రామస్థులు!
పరారీలో ఉన్ననిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకొస్తున్నా చిన్నారులపై లైంగిక దాడులు ఆగడం లేదు. దేశంలో నిత్యం ఏదో ఒక మూల చిన్న పిల్లలను దిరించి కామాంధులు వాంఛ తీర్చుకుంటున్నారు. నెల రోజుల పసిపాప దగ్గర నుంచి 90 ఏళ్ల ముసలావిడ వరకు ఆడదైతే చాలు అన్నట్లుగా కామాంధులు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులు,పరిచం ఉన్నవాళ్లే ఎక్కువగా ఇలా పాల్పడుతున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.
కొమురవెల్లి మండలం గురువన్నపేటలో ఏడో తరగతి చదువుతున్న బాలికపై ఓ యుస్లిం యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. దీంతో ఆగ్రహించిన బాలిక కుటుంబ సభ్యులు, గ్రామస్తులు నిందితుడికి వెళ్లారు. బాలిక కుటుంబ సభ్యులు తమ ఇంటికి వస్తున్నారన్న విషయం తెలుసుకున్న యవకుడు, కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి అక్కడి నుంచి పరారయ్యారు.
ఈ క్రమంలో నిందితుడి ఇంటిని పెట్రోల్ పోసి తగులబెట్టారు. యువకుడి కుటుంబానికి సంబంధించిన కారు, జేసీబీని ధ్వంసం చేశారు. గ్రామస్తుల దాడిలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళన కారులను చెదరగొట్టారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్ననిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.



