ఫోన్ ట్యాపింగ్ పై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్పీ కీలక వ్యాఖ్యలు

పల్లవి, వెబ్ డెస్క్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన క్యాబినెట్ లోనే ముఖ్యమైన మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు బీఆర్ఎస్ కు చెందిన ముఖ్య నేతలందరీ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆర్ఎస్పీ మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో ఉల్టా చోర్ కొత్వాల్ కో ఢాంటే అన్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారం ఉందని ఆయన ధ్వజమెత్తారు.
పెగాసస్ సాఫ్ట్ వేర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాడుకున్నట్లు అనుమానాలు ఉన్నాయి. మంత్రుల ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఆంగ్ల దినపత్రికలు నిజాలను బయటపెట్టాయి. ఇద్దరు మంత్రులు సరదగా మాట్లాడుకున్నది కూడా రేవంత్ రెడ్డి ట్యాప్ చేయడం ద్వారా తెలుసుకున్నారు అని ఆయన ఆరోపించారు.
అఖరికీ తనకు ఇంతటి స్థాయినిచ్చిన వాళ్ల పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోన్ ను కూడా ఆయన ట్యాప్ చేస్తున్నారనే అనుమానం ఉందని పేర్కొన్నారు. కేంద్రం లోని బీజేపీ సాయంతో ఇక్కడ బీఆర్ఎస్, వాళ్ల పార్టీకు చెందిన నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ఆర్ఎస్పీ కీలక వ్యాఖ్యలు చేశారు.
Related News
-
చిరునవ్వుతోనే మత్తెక్కిస్తోన్న ప్రగ్యా జైస్వాల్
-
అల్లరి నరేష్ హీరోగా సరికొత్త మూవీ
-
రోడ్లపై రైతులు.. స్టార్ హోటల్లో మంత్రులు-మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
-
నేను బీఆర్ఎస్ లోనే ఉన్నా-ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
-
గణేశ్ లడ్డూను దక్కించుకున్న ముస్లిం మహిళ
-
CSR నిధులతో గురుకులాలు అభివృద్ధి – మంత్రి దామోదర