డిప్యూటీ సీఎం భట్టీకి షాకిచ్చిన మంత్రి పొంగులేటి ..!

పల్లవి న్యూస్ – పాల్వంచ :-తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి.. ఆర్థిక శాఖ మంత్రి భట్టీ విక్రమార్క మల్లుకు రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిగ్ షాకిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుండి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న మంత్రుల మధ్య ఆధిపత్యం నడుస్తుందని ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఉమ్మడి ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం పెద్దమ్మ తల్లి ఆలయ నూతన కమిటీ ఏర్పాటు సాక్షిగా ఉప ముఖ్యమంత్రి భట్టీ.. మంత్రి పొంగులేటి మధ్య ఉన్న విబేధాలు బయటపడ్డాయి.
పెద్దమ్మ తల్లి ఆలయ నూతన కమిటీలో పదమూడు మంది సభ్యులతో తన అనుచరులు ఉండేలా ఏర్పాటు చేశారు భట్టీ. దీనికి సంబంధించిన జమ్ముల రాజశేఖర్ ను చైర్మన్ గా నియమిస్తూ పదమూడు మంది సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించడానికి దేవదాయ శాఖ ఆర్టీ 66జీవోను విడుదల చేశారు. పాల్వంచలోని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన అనుచరులు మంత్రికి విన్నవిస్తూ కమిటీలో ఒక్కరికి కూడా తమ వర్గానికి చోటు దక్కలేదని వాపోయారు.
తక్షణమే ఆ కమిటీని రద్ధు చేసి తాను సూచించిన సభ్యులను కమిటీలో చేర్చాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో చేసేది ఏమిలేక దేవదాయ శాఖ అధికారులు ఆర్టీ112 ను ఖరారు చేశారు. తన అనుచరుడైన బాలినేని నాగేశ్వరరావును చైర్మన్ గా పోలీస్ బందోబస్తుల మధ్యలో ప్రమాణ స్వీకారం చేయించారు మంత్రి పొంగులేటి. ఈ మొత్తం కథలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన పంతాన్ని నెగ్గించుకోని ఉప ముఖ్యమంత్రి భట్టీకి బిగ్ షాకిచ్చారు.
Related News
-
బీజేపీలో కవిత చేరికపై రాంచంద్రరావు క్లారిటీ
-
భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి -మాజీ ఎమ్మెల్యే సండ్ర
-
ఎంపీ రవిచంద్ర లేఖకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ సానుకూల స్పందన
-
తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి స్వాతంత్య్ర పోరాటం – మాజీ సీఎం కేసీఆర్
-
మతం రంగు పూసి తప్పుడు ప్రచారం – డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క మల్లు
-
మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో పనులు వేగవంతం చేయాలి- మాజీ వైస్ చైర్మన్ ఫరీద్