మంత్రి కొండా సురేఖ మరోసారి సంచలన కామెంట్స్
మంత్రి కొండా సురేఖ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్లను పట్టించుకోలేదన్న మంత్రి.. హాస్టళ్లలోని భోజనంలో పురుగులు వచ్చేవని తెలిపారు.
మంత్రి కొండా సురేఖ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్లను పట్టించుకోలేదన్న మంత్రి.. హాస్టళ్లలోని భోజనంలో పురుగులు వచ్చేవని తెలిపారు. సంక్షేమ హాస్టళ్లలో సదుపాయాలు కొరవడినా బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోలేదని తెలిపారు. గురుకులాల్లో కుట్రల వెనుక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కుట్ర దాగి ఉందని మంత్రి కొండా ఆరోపించారు. గతంలో ఆయన గురుకులాల కార్యదర్శిగా పనిచేశారు. తన అనుచరులనే సిబ్బందిగా నియమించుకున్నారు తీవ్రమైన ఆరోపణలు చేశారు.
హాస్టళ్లలోని విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక… ఒక విద్యార్థిని చనిపోయిందని ఆమె మృతిని రాజకీయం చేయడం తగదని అన్నారు. గురుకులంలో కలుషిత ఆహారం తిని చనిపోయిన వాంకిడి విద్యార్దిని శైలజ మీద అంత ప్రేమ ఉంటే బీఆర్ఎస్ పార్టీ కోటి రూపాయలు ఇవ్వొచ్చు కదా అని సూచించారు.



