పర్యావరణహిత వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సండ్ర

పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఖమ్మం జిల్లా, టేకులపల్లి గ్రామంలోని వెంకటేశ్వర గోశాలలో రాబోయే వినాయక చవితి వేడుకల దృష్ట్యా, గోశాల నిర్వాహకులు శ్రీనివాస్ ఆచార్యులు గారి ఆధ్వర్యంలో గోమయంతో తయారుచేసిన పర్యావరణహిత వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సండ్ర వెంకట వీరయ్య పర్యావరణ పరిరక్షణ, సంప్రదాయాల విలువల కోసం ఇలాంటి కార్యక్రమాలు అత్యంత అవసరమని, గోశాల నిర్వహణలో తనదైన ప్రత్యేకతతో ముందుండే శ్రీనివాస్ ఆచార్యులు గారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Related News
-
చిరునవ్వుతోనే మత్తెక్కిస్తోన్న ప్రగ్యా జైస్వాల్
-
అల్లరి నరేష్ హీరోగా సరికొత్త మూవీ
-
రోడ్లపై రైతులు.. స్టార్ హోటల్లో మంత్రులు-మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
-
నేను బీఆర్ఎస్ లోనే ఉన్నా-ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
-
గణేశ్ లడ్డూను దక్కించుకున్న ముస్లిం మహిళ
-
CSR నిధులతో గురుకులాలు అభివృద్ధి – మంత్రి దామోదర