150 గజాల స్థలం కోసం : భర్త బతికి ఉండగానే డెత్ సర్టిఫికెట్ తీసుకున్న భార్య
భర్త బతికి ఉండగానే డెత్ సర్టిఫికెట్ తీసుకుంది ఓ భార్య. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. వరంగల్ జిల్లాలోని కాజీపేట్ కు చెందిన మాలోతు వినోద్ కు ఇస్లావత్ లక్ష్మీ నిర్మల అనే మహిళతో 2008లో పెళ్లైంది. వీరి మధ్య చిన్నచిన్న గొడవలు కావడంతో 2013 సెప్టెంబర్‌లో తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది నిర్మల. అయితే ఈ కేసు విషయమై వినోద్ వరంగల్‌లోని తన అడ్వకేట్ ప్రభాకర్‌ను కలిసేందుకు వెళ్లగా ఊహించని విషయం తెలిసి షాక్ తిన్నాడు వినోద్.
2013 మార్చి 19న తన భర్త వినోద్ చనిపోయినట్లుగా నిర్మల రంగారెడ్డి జిల్లాలో డెత్ సర్టిఫికెట్ తీసుకుంది. అంతేకాకుండా అదే ప్రాంతంలో తనకు చెందిన 150 గజాల స్థలాన్ని హరినాథ్ రెడ్డి అనే వ్యక్తికి అమ్మేసింది. తన భర్త చనిపోయాడని డెత్ సర్టిఫికెట్ సృష్టించిన నిర్మల.. 6 నెలల తర్వాత వినోద్ పై పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. దీంతో వినోద్ .. నిర్మలపై కాజీపేట పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు పెట్టాలని నిర్ణయించుకున్నాడు.
Related News
-
ఉపఎన్నికలపై పీసీసీ చీఫ్ మహేశ్ సంచలన వ్యాఖ్యలు
-
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ సన్నాహక సమావేశం
-
గణేష్ ఉత్సవాలంటే.. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు – సీఎం రేవంత్ రెడ్డి
-
అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్ధు..!
-
బీజేపీలో కవిత చేరికపై రాంచంద్రరావు క్లారిటీ
-
భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి -మాజీ ఎమ్మెల్యే సండ్ర



