గుడ్ న్యూస్..2 వారాల పాటు దసరా సెలవులు!
విద్యార్థులకు గుడ్ న్యూస్.
విద్యార్థులకు గుడ్ న్యూస్. ఈ దసరా పండగకు 13 రోజుల పాటు సెలవులు రానున్నాయి. అక్టోబర్ 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు తెలంగాణలోని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. 15వ తేదీన పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 2 గాంధీ జయంతితో సెలవులు మొదలు కానున్నాయి. ఆ తర్వాత నుంచి బతుకమ్మ, దసరా సెలవులు ఉంటాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. వరుసగా 13 రోజులు సెలవులు రావడంతో విద్యార్థులు ఎగిరి గంతేస్తున్నారు. ఊర్లకు వెళ్లడానికి సిద్ధం అవుతున్నారు.
ఇక,కొన్ని ప్రైవేట్ పాఠాశాలలకు 14 రోజులు సెలవులు ఇవ్వనున్నారు. కొన్ని ప్రైవేట్ పాఠశాలలు అక్టోబర్ 1వ తేదీ నుంచి సెలవులు ఇస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించాయి. మళ్లీ అక్టోబర్ 15వ పునః ప్రారంభం ఉంటుందని విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం పంపాయి.



