మన్ కీ బాత్..తెలంగాణపై మోదీ ప్రశంసలు
నేటితో మన్ కీ బాత్ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2014 అక్టోబర్ 3న దసరా రోజు మన్ కీ బాత్ తొలి ఎపిసోడ్ ప్రారంభమైంది.
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతి నెల చివరి ఆదివారం ఆల్ ఇండియా రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ ద్వారా దేశప్రజలనుద్దేశించి మాట్లాడుతున్న విషయం తెలిసిందే. ఇవాళ తన 114 మన్ కీ బాత్ ఎపిసోడ్ లో మోదీ చాలా అంశాలను ప్రస్తావించారు. ఈ మన్ కీ బాత్ కి చాలా ప్రత్యేక ఉంది. నేటితో మన్ కీ బాత్ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2014 అక్టోబర్ 3న దసరా రోజు మన్ కీ బాత్ తొలి ఎపిసోడ్ ప్రారంభమైంది. మన్ కీ బాత్‌ను నిరంతరం ప్రసారం చేస్తున్న వివిధ టీవీ ఛానెల్‌లు, ప్రాంతీయ టీవీ ఛానెల్స్ కి,యూటూబర్స్ కి ఈ సందర్భంగా మోదీ కృతజ్ఞతలు తెలిపారు. మన్ కీ బాత్ ని నడిపిస్తున్నది శ్రోతలేనని.. ప్రజలు పాజిటివ్ థింగ్స్‌ని ఇష్టపడతారని మన్ కీ బాత్ నిరూపించిందని ప్రధాని అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ 114 మన్ కీ బాత్ ఎపిసోడ్లో తెలంగాణ ప్రజలను మెచ్చుకున్నారు. అనుకున్న లక్ష్యం కంటే ఎక్కువగా మొక్కలను నాటడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం కొత్త రికార్డ్ సృష్టించిందని మోదీ అన్నారు. తెలంగాణతో పాటు యూపీ, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు కూడా ఈ రికార్డ్ సాధించాయి. ఇదంతా “ఏక్ పేడ్ మా కే నామ్” కార్యక్రమంలో భాగంగా జరిగింది.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ జూన్ లో.. ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటి, దానికి తల్లి పేరు పెట్టాలని పిలుపు ఇచ్చారు. “ఏక్ పేడ్ మా కే నామ్” పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని అన్ని రాష్ట్రాలూ అమలు చేశాయి. గత బుధవారం నాటికి దేశవ్యాప్తంగా 80 కోట్ల మొక్కలు నాటడం ద్వారా లక్ష్యాన్ని సాధించామని కేంద్ర పర్యావరణ శాఖ తెలిపింది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మొక్కలు నాటే విషయంలో ఎంతో ఆసక్తి చూపించింది. కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఏటా మొక్కలు నాటిస్తూ.. తెలంగాణలో గ్రీనరీని బాగా పెంచింది. .



