సింహాచలం బాధితులకు అండగా ప్రధాని మోదీ..!
ఏపీలోని వైజాగ్ పరిధిలోని సింహాచలం శ్రీవరాహా లక్ష్మీ నరసింహా స్వామి చందనోత్సవం సందర్భంగా గోడ కూలడంతో ఎనిమిది మంది భక్తులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేందర్ మోదీ తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు.
ఘటనలో చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలి. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారికి మెరుగైన సేవలు అందాలి.క్షత్రగాత్రులు త్వరగా కోలుకోవాలి.
ఈ సంఘటనలో మృతి చెందిన కుటుంబాలకు రెండు లక్షల చొప్పున పీఎంఎన్ఆర్ఎఫ్ నుండి ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా గాయపడిన వారికి యాబై వేల చొప్పున అందజేస్తామని ప్రధాని మోదీ వెల్లడించారు.



