అక్టోబర్ లో సందర్శించడానికి బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ లు ఇవే
అక్టోబర్ లో టూర్ కి వెళ్లడానికి బెస్ట్ ప్లేస్ లు ఏవో ఇప్పుడు చూద్దాం.
అక్టోబర్ లో దసరా పండుగ ఉన్న కారణంగా స్కూల్స్ కి,కాలేజీలకు దాదాపు రెండు వారాల పాటు సెలవులు ఉండటంతో చాలామంది హాలిడే ట్రిప్ కు ఫ్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో మనదేశంలో అక్టోబర్ లో టూర్ కి వెళ్లడానికి బెస్ట్ ప్లేస్ లు ఏవో ఇప్పుడు చూద్దాం.
1.వాగమోన్,కేరళ
కేరళ రాష్ట్రంలోని వాగమోన్ అనే చిన్న హిల్ స్టేషన్ సెంట్రల్ ట్రావెన్కోర్లోని చిన్న పట్టణం. ఈ ప్రాంతమంతా పచ్చదనంతో నిండి ఉండటంతో పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక్కడి కొండలు, లోయలు, వాగులు, వంకలు టూరిస్టులను ఆకర్షిస్తాయి. ఈ ప్రదేశం టీ తోటలకు కూడా ప్రసిద్ధి.
2.జమ్మూకశ్మీర్
భూతల స్వర్గంగా పేరుపొందిన జమ్మూకశ్మీర్ ని ఇప్పటివరకు వెళ్లనట్లయితే అక్టోబర్ లో వెళ్లడానికి ఇది బెస్ట్ టైమ్. ఇక్కడ ప్రకృతి బడిలో మిమల్ని మీరు మైమర్చిపోవడం గ్యారెంటీ.
3. రిషికేష్,ఉత్తరాఖండ్
దేశంలోని నదీ తీర ప్రాంతాల్లో ఉండే అందమైన పట్టణాల్లో రిషికేశ్ ఒకటి. యోగా యాపిటల్ ఆఫ్ వరల్డ్ గా గుర్తింపుపొందిన రిషికేష్ అక్టోబర్ లో సందర్శించడానికి బెస్ట్ ప్లేస్. ప్రకృతి అందాలతో నిండి ఉండే అద్భుతమైన ప్రదేశమే కాకుండా చాలా మంది ఇష్టపడే గమ్యస్థానంగానూ పేరు సాధించింది. రిషికేశ్ ప్రధానంగా ఆధ్యాత్మికత పరంగా, యోగా కేంద్రంగా, సాహస ప్రియుల గమ్యస్థానంగా మంచి గుర్తింపు పొందింది.
4.బిర్ బిల్లింగ్,హిమాచల్ ప్రదేశ్
హిమాచల్ ప్రదేశ్ లోని ఈ ఆఫ్ బీట్ డెస్టినేషన్ అడ్వెంచర్ ను ఇష్టపడేవాళ్లు అక్టోబర్ లో వెళ్లడానికి ఫర్ఫెక్ట్ గా ఉంటుంది. ఈ ప్లేస్ ని పారాగ్లైడింగ్ కు హెవెన్ అని కూడా పిలుస్తారు. యూనిక్ అడ్వెంచర్స్ కి ఈ ప్లేస్ ప్రసిద్ది.
5. బాంధవ్ గర్ నేషనల్ పార్క్
వన్యప్రాణులను వాటి సహజ నివాస స్థలంలో చూడటం అద్భుతమైన ఎక్స్ పీరియన్స్. మధ్యప్రదేశ్లోని బాంధవ్ గర్ నేషనల్ పార్క్ దీనికి సరైన ప్రదేశం. సుసంపన్నమైన జీవవైవిధ్యానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ బెంగాల్ టైగర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. బాంధవ్ గర్ అక్టోబర్లో సందర్శించడానికి భారతదేశంలోని ఉత్తమ గమ్యస్థానాలలో ఒకటిగా ఉంది.
6. హంపి, కర్ణాటక
హంపి కర్ణాటకలో ఉన్న ఒక చారిత్రక నగరం. విజయనగర రాజుల పాలనలో రాజధానిలో ఓ వెలుగు వెలిగిన హంపిలో.. ఎక్కడ చూసినా అద్భుత దృశ్యాలే కనిపిస్తున్నాయి. హంపిలో స్తంభాలు సంగీతాన్ని చేయడం మనకు తెలిసిందే. హంపి మొత్తం ప్రపంచంలో రెండవ అతిపెద్ద మధ్యయుగ యుగం నగరంగా ఉండేది. అక్కడి దేవాలయాలు, నిర్మాణాలు, శిల్పాలు, భవనాలు సహా చూడటానికి అనేక ప్రదేశాలు ఉన్నాయి.
7.గోకర్ణ
కర్ణాటకలోని గోకర్ణ ట్రిప్ మధుర జ్ఞాపకంగా ఉంటుంది. అక్కడి బీచ్లు, ఆలయాలు ప్రతి ఒక్కర్నీ ఆకట్టుకుంటాయి. గోకర్ణ సమీపంలోని ప్రకృతి ఒడిలో ఉండే అద్భుతమైన యానా కేవ్స్, విబూధి వాటర్ ఫాల్స్ ని కూడా ఈ ట్రిప్ లోనే కవర్ చేయవచ్చు



