తెలంగాణ టూరిజం బంపరాఫర్..తక్కువ ధరలోనే హైదరాబాద్–గోవా టూర్
గోవా.. విహారయాత్ర వినోదాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించాలనుకునే వారికి స్వర్గధామం.
గోవా.. విహారయాత్ర వినోదాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించాలనుకునే వారికి స్వర్గధామం. భారతదేశంలో కేవలం 2 జిల్లాలను కలిగి ఉన్న ఏకైక రాష్ట్రం గోవానే. అద్భుతమైన బీచ్ లు, అందమైన జలపాతాలు, గొప్ప చరిత్రాక కట్టడాలు ఎన్నో గోవాలో ఉన్నాయి. ఈ తీర ప్రాంత స్వర్గంలో చూడడానికి, అనుభవించడానికి చాలా ఉన్నాయి. నిత్యం టూరిస్టులతో కళకళలాడే గోవాకు విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో వస్తుంటారు. విదేశీయులు మనదేశంలో ఎక్కువగా సందర్శించే టూరిస్ట్ ప్లేస్ లలో గోవా ఒకటి.
అయితే మీరు మీ ఫ్రెండ్, ఫ్యామిలీతో గోవా ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా ? అయితే మీకో గుడ్న్యూస్. హైదరాబాద్ నుంచి గోవా టూర్కు తెలంగాణ టూరిజం స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. గోవా ట్రిప్ ఎన్ని రోజులు ఉంటుంది ? ఒక్కరికి ఎన్ని డబ్బులు ఛార్జ్ చేస్తారు ? అనే వివరాలను ఇప్పుడు చూద్దాం.
మొత్తం 4 రోజులు ఈ టూర్ ఉంటుంది. ప్రతీ సోమవారం హైదరాబాద్ నుంచి గోవాకు టూర్ ప్రారంభం అవుతుంది. ప్రతీ సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు బషీర్బాగ్ నుంచి ఏసీ బస్సు ద్వారా ప్రయాణం ప్రారంభం అవుతుంది. ఈ టూర్ ప్యాకేజీ ధర విషయానికొస్తే.. పెద్దలకు రూ. 11999, పిల్లలకు రూ.9599 ఛార్జ్ వసూలు చేస్తారు. టూర్ ప్యాకేజీలో భాగంగా గోవాలోని లార్డ్ బోడ్గేశ్వర్ టెంపుల్, ఫోర్ట్ అగ్వాడా, బాగా బీచ్, కలంగుట్ బీచ్ వంటి పలు ప్రముఖ బీచ్ లు, దేవాలయాలు, బోట్ క్రూయిజ్, ఓల్డ్ చర్చిలు సందర్శించవచ్చు. బుకింగ్స్ కోసం 9848540371 నంబర్లో సంప్రదించవచ్చు.
Related News
-
ఏడో తరగతి విద్యార్థినిపై ముస్లిం యువకుడు లైంగికదాడి..ఇంటిని తగలబెట్టిన గ్రామస్థులు!
-
అక్టోబర్ లో సందర్శించడానికి బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ లు ఇవే
-
సీఎం రేవంత్ రెడ్డికి విరాళమిచ్చిన మహేష్ బాబు..సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఫొటోలు చూడండి
-
వీడెవండీ బాబు: ఏకంగా ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లాడు..చివరికి
-
పాపులర్ జర్నలిస్ట్ మురళీధర్ కు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం
-
తప్పుల తడకగా ఓటర్ల జాబితా!



