పాపులర్ జర్నలిస్ట్ మురళీధర్ కు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం
క్రైం డైరీస్ పోగ్రామ్ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకుంది
ప్రాధాన్యత ఉన్న పోలీస్ వ్యక్తులను ఇంటర్య్వూలకు పిలిచి విధి నిర్వహణలో వారు ఎదుర్కొన్న సవాళ్లు, వారు ఆ స్థాయికి చేరుకోవడానికి పడ్డ కష్టం వంటి ఇంట్రెస్టింగ్ అంశాలతోక్రైం డైరీస్ పేరుతో ఐడ్రీమ్ యూట్యూబ్ ఛానెల్..ఇంటర్య్వూస్ ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఇంటర్వ్యూస్ నిర్వాహకుడిగా మురళీధర్ ప్రత్యేకతను చాటుకున్నారు. ఇప్పటికి 499 ఇంటర్వ్యూలను చేసి 500వ ఎపిసోడ్ కు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించిన ప్రోమోను తెలంగాణ డీజీపీ లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రైం డైరీస్ 500 ఎపిసోడ్స్ చేయడం సాధారణ విషయం కాదని తెలిపారు. దీని వెనకాల కఠోరమైన కృషి చేసిన మురళీధర్ ను అభినందించారు. ప్రజల రక్షణ కోసం, శాంతి భద్రతలను కాపాడేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని ప్రజలు దీన్ని స్వాగతిస్తున్నారని తెలిపారు. పోలీస్ ఇంటర్య్వూలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో చూశానని డీజీపీ తెలిపారు.
ఇక, ఐడ్రీమ్ నిర్వహిస్తున్న క్రైం డైరీస్ పోగ్రామ్ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకుంది. దీనికి సంబంధించిన సర్టిఫికేట్ ను ఇండియన్ బుక్ ఆఫ్ ప్రతినిధులు ఐడ్రీమ్ అధినేత వాసుదేవరెడ్డికి అందించారు. అదేవిధంగా 500 ఎపిసోడ్స్ నిర్వహించి ప్రత్యేకత చాటుకున్న మురళీధర్ కు కూడా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టీఫికేట్ అందించారు. ఈ సందర్భంగా 500 కాదు 1000 ఎపిసోడ్స్ మైలురాయిని కూడా మూడేళ్లలో అందుకోవాలని తెలంగాణ డీజీపీ ఆకాంక్షించారు.
Related News
-
ఏడో తరగతి విద్యార్థినిపై ముస్లిం యువకుడు లైంగికదాడి..ఇంటిని తగలబెట్టిన గ్రామస్థులు!
-
తెలంగాణ టూరిజం బంపరాఫర్..తక్కువ ధరలోనే హైదరాబాద్–గోవా టూర్
-
సీఎం రేవంత్ రెడ్డికి విరాళమిచ్చిన మహేష్ బాబు..సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఫొటోలు చూడండి
-
వీడెవండీ బాబు: ఏకంగా ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లాడు..చివరికి
-
తప్పుల తడకగా ఓటర్ల జాబితా!
-
రష్యా మిలటరీలో నరకం..ఎట్టకేలకు ఇంటికి తెలంగాణ యువకుడు



