సీఎం రేవంత్ రెడ్డికి విరాళమిచ్చిన మహేష్ బాబు..సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఫొటోలు చూడండి
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దంపతులు సోమవారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసారు.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దంపతులు సోమవారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసారు. ఈ సందర్భంగా మహేష్ బాబు దంపతులు ముఖ్యమంత్రి సహాయనిధికి భారీగా రూ.50 లక్షల విరాళం అందజేశారు. తెలంగాణలో ఇటీవల వచ్చిన భారీ వర్షాలు, వరదల వల్ల పలు ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. బాధితులను ఆదుకునే క్రమంలో తమ వంతుగా అనేక రంగాలకు చెందిన ప్రముఖులు సీఎం రిలీఫ్ ఫండ్ కు పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే వరద సహాయాన్ని అందించేందుకు మహేష్ బాబు సైతం స్పందించి ముందుకు వచ్చారు.
సోమవారం జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో మహేష్ బాబు,ఆయన బార్య నమ్రత శిరోద్కర్ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి రూ.50లక్షల చెక్కును అందజేశారు. రూ.50 లక్షలతో పాటు, ఆయన నిర్వహిస్తున్న AMB సినిమాస్ తరపున కూడా మరో రూ.10 లక్షల విరాళాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహేష్ బాబు దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి సమయంలో సినీ నటులు కూడా తమ వంతు సహాయాన్ని అందించడంలో ముందుండటం గర్వకారమని..మహేష్ నమ్రత దంపతులను అభినందించారు. మహేష్ బాబు చేసిన ఈ సహాయం పునరావాస కార్యక్రమాలకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. అయితే ఈ సందర్భంగా మహేష్ బాబుని కొత్త లుక్ లో చూసిన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మహేష్ బాబు కొత్త లుక్ అదిరిపోదంటూ సోషల్ మీడియాలో ఆ ఫొటోలను తెగ షేర్ చేస్తున్నారు. మహేష్ బాబు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Related News
-
గాంధీ సరోవర్ కు రక్షణ భూములు ఇవ్వండి – సీఎం రేవంత్ రెడ్డి
-
బీజేపీలోకి సీఎం రేవంత్ రెడ్డి – మాజీ మంత్రి జగదీశ్
-
గణేష్ ఉత్సవాలంటే.. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు – సీఎం రేవంత్ రెడ్డి
-
బీఆర్ఎస్ పని అయిపోయింది – సీఎం రేవంత్ రెడ్డి
-
సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట
-
లక్ష కోట్ల ఆస్తి సీక్రెట్ చెప్పవా కేసీఆర్ – సీఎం రేవంత్ రెడ్డి



