బీఆర్ఎస్ పని అయిపోయింది – సీఎం రేవంత్ రెడ్డి

పల్లవి, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ పార్టీ కాలగర్భంలో కలిసిపోతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన గురించి ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి హరీశ్ , సంతోష్ వెనుక ఉన్నానని కొందరు అంటున్నారు. ఎమ్మెల్సీ కవిత వెనుక ఉన్నానని మరికొందరు అంటున్నారు. నేను ఎవరి వెనుకా లేను. చెత్తగాళ్ల వెనుక నేనెందుకు ఉంటాను. మీ పంచాయితీల్లోకి నన్ను లాగొద్దు. గతంలో ఇతరులను ఎదగనీయనివాల్లు ఇప్పుడు పంచాయితీలు పెట్టుకుంటున్నారు” అని వ్యాఖ్యానించారు.
అంతకుముందు ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశంలో మాట్లాడుతూ ” హరీశ్ రావు, సంతోష్ రావు లపై సంచలన ఆరోపణలు చేశారు.. వీరిద్దరూ బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవాలని కుట్రలు చేస్తున్నరు. మొత్తం వాళ్లే చేశారు నాన్నా.. అంటూ వారిరువురి మీదా తీవ్ర ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. అంతేకాదు ‘రేపు కేటీఆర్‌కు ఇదే జరుగుతుంది.. కేసీఆర్‌కు ఇదే జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి, హరీష్ రావు ఒకే విమానంలో ప్రయాణించారు. రేవంత్ రెడ్డి కాళ్లు హరీష్ రావు పట్టుకున్నాకే ఈ కుట్రలు మొదలయ్యాయి అని కూడా సంచలన ఆరోపణలు చేశారు.